Actress: అరుదైన ఘనత సాధించిన బాలీవుడ్ బ్యూటీ!

ప్రముఖ అమెరికన్ మ్యాగజైన్ టైమ్ (Time) ప్రపంచంలోని ‘100 మోస్ట్‌ ఇన్‌ఫ్లూయెన్షియల్‌ పీపుల్‌ ఆఫ్‌ 2024’ లిస్టులో కేవలం ఒకే ఒక్క భారతీయ నటి స్థానం సంపాదించింది. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

New Update
Actress: అరుదైన ఘనత సాధించిన బాలీవుడ్ బ్యూటీ!

ప్రముఖ అమెరికన్ మ్యాగజైన్ టైమ్ (Time) ప్రపంచంలోని “100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షల్ పీపుల్” జాబితాను ఏటా విడుదల చేస్తుంది. ఒక వ్యక్తి ప్రపంచంపై ఎంత ప్రభావం చూపుతున్నారు? వారి పనులు ఏ రంగాలను ప్రభావితం చేస్తున్నాయి? వంటి తదితర అంశాల ఆధారంగా ఈ లిస్టును టైమ్‌ మ్యాగజైన్ రూపొందిస్తుంది. అయితే 2024 సంవత్సరానికి గానూ బుధవారం ఈ లిస్టును రిలీజ్ చేసింది.ఈ జాబితాలో కేవలం ఒకే ఒక్క భారతీయ నటి స్థానం సంపాదించడం గమనార్హం. టైమ్స్‌ ‘100 మోస్ట్‌ ఇన్‌ఫ్లూయెన్షియల్‌ పీపుల్‌ ఆఫ్‌ 2024’ లిస్టులో అలియా భట్ చోటు దక్కించుకుంది. ఆమె కళాకారుల విభాగంలో ఈ జాబితాలో నిలిచింది.

బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో అలియా భట్ ఒకరు. RRR సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన అలియాకు కోట్ల విలువైన ఆస్తులు, సంపద ఉన్నాయి. అయితే ఆమె 2024 టైమ్స్-100లో ఎందుకు చోటు దక్కించుకుందో బ్రిటిష్ దర్శకుడు టామ్ హార్పర్ వివరించాడు.అలియా భట్‌ 2023లో “హార్ట్ ఆఫ్ స్టోన్” మూవీ ద్వారా హాలీవుడ్‌లో అడుగుపెట్టింది. బ్రిటిష్ దర్శకుడు టామ్ హార్పర్ దీని డైరెక్టర్. అలా ఆమెతో కలిసి పని చేసే అవకాశం వచ్చింది. ఆ సమయంలో ఆమె గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు. టైమ్ మ్యాగజైన్‌లోని ఓ వ్యాసంలో అలియా గురించి హార్పర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

publive-image

“అలియా భట్ ఒక అద్భుతమైన ప్రతిభావంతురాలు. దశాబ్దం కాలంగా నటనకు ప్రశంసలు అందుకుంటూ ప్రపంచంలోని టాప్ యాక్ట్రెస్‌లలో ఒకరిగా ఆమె నిలుస్తోంది. అంతేకాకుండా, అలియా సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్. నిజాయితీతో నాయకత్వం వహించే ఒక దాతృత్వవేత్త కూడా.” అని టామ్ హార్పర్ వ్యాసంలో పేర్కొన్నారు. అలియా ‘ట్రూలీ ఇంటర్నేషనల్ స్టార్’ అని ప్రశంసించారు.“ఆమెను ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ సినిమాలో కలిశాను, ఇది ఆమె ఇంగ్లీష్ మూవీ డెబ్యూ. ఆమె పేరున్న నటి అయినా, సెట్‌లో చాలా సింపుల్‌గా, ఫన్నీగా ఉంటుంది. చాలా ఓపెన్‌గా, క్రియేటివ్ రిస్క్స్‌ స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది. ఎమోషన్స్ బాగా ఎక్స్‌ప్రెస్ చేస్తుంది.

publive-image

అలియా భట్‌కు సినిమా నటి ఆకర్షణను నిజాయితీ, సున్నితత్వంతో కలపగల సామర్థ్యం ఉంది. ఒక నటిగా ఆమె చాలా ప్రతిభవంతురాలు. అంటే ఆమె పాత్రలలో పరకాయ ప్రవేశం చేయగలదు. ప్రేక్షకులతో డీప్ లెవెల్‌లో కనెక్ట్ అవ్వగలదు. ఒక వ్యక్తిగా, ధృఢత్వం, సృజనాత్మకత ఆమెను ఒక నిజమైన ఇంటర్నేషనల్ స్టార్‌గా మార్చేశాయి." అని హార్పర్ పేర్కొన్నారు.అలియా భట్ నికర సంపద సుమారు రూ.517 కోట్లు అని అంచనా వేశారు. ఈ ముద్దుగుమ్మ సినిమాకు రూ.15-20 కోట్లు వసూలు చేస్తుంది. అలియా భట్ ఇల్లు అయిన “వాస్తు (Vastu)” విలువ రూ.35 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో రణ్‌బీర్ కపూర్, కూతురు రాహాతో కలిసి అలియా నివసిస్తుంది. ఆమె బాంద్రాలో రూ.37 కోట్ల విలువైన మరో బంగ్లా ఉంది. లండన్‌లో ఒక అద్భుతమైన ఇల్లు కూడా ఉంది. ఆమె కార్ల కలెక్షన్‌లో రూ.1.76 కోట్లకు పైగా విలువైన BMW 7 సిరీస్, రూ.2 కోట్లకు పైగా విలువైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ ఉన్నాయి.

నటనతో పాటు, అలియా భట్ నిర్మాతగా కూడా రాణిస్తోంది. ఆమె నెక్స్ట్ మూవీ “జిగ్‌రా” సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. వసన్ బాలా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దీనిని కరణ్ జోహర్ ధర్మ ప్రొడక్షన్స్‌తో సహా అలియా సొంత నిర్మాణ సంస్థ అయిన ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తుంది.

Advertisment
తాజా కథనాలు