RH Blood Group: మొత్తం ప్రపంచ జనాభా 800 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో కేవలం 45మందికి మాత్రమే ఒక రకమైన బ్లడ్ గ్రూప్ ఉంటే నమ్ముతారా...కానీ నమ్మక తప్పదు. ఎందుకంటే నిజంగానే అలాంటి అరుదై బ్లడ్ గ్రూప్ ఒకటి ఉంది. ప్రస్తుతానికి కేవలం 45 మంది శరీరంలో మాత్రమే ప్రవహిస్తున్న ఈ బ్లడ్ గ్రూప్ పేరు Rh. ఇది చాలా అరుదైన బ్లడ్ గ్రూప్. అందుకే దీన్ని గోల్డెన్ బ్లడ్ అని కూడా అంటారు. 2018లో ఒక నివేదిక ప్రకారం ఈ రక్తం కోసం వరల్డ్ వైడ్‌గా వెతికితే ప్రపంచంలోనే కేవలం 45 మంది మాత్రమే ఈ ప్రత్యేక రక్తం కలిగి ఉన్నారని తేలింది. వీరిలో తొమ్మిది మంది మాత్రమే అప్పటివరకు రక్తదానం చేసి ఉన్నారు. ఇక ఈ బ్లడ్ గ్రూప్ ప్రత్యేకత ఏంటంటే.. ఈ బ్లడ్ ఎవరికైనా ఇవ్వవచ్చు. ఈ బ్లడ్ గ్రూప్ రక్తం ఇతర బ్లడ్ గ్రూపులకు అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ గుంపులోని వ్యక్తులు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైతే సమస్యను ఎదుర్కొంటారు. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రక్తం కూడా.
ఈ బ్లడ్ గ్రూప్‌ను 1960లో కనుగొన్నారు. దీని అసలు పేరు Rh null. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వారు అమెరికా, కొలంబియా, బ్రెజిల్, జపాన్‌లలో కనిపిస్తారు. Rh కారకం ఎర్ర రక్త కణాల ఉపరితలంపై కనిపించే ఒక ప్రత్యేక రకం ప్రోటీన్. ఈ ప్రొటీన్ ఎర్ర రక్త కణాల్లో ఉంటే రక్తం Rh పాజిటివ్‌గా ఉంటుంది. ఈ ప్రోటీన్ లేనప్పుడు, రక్తం Rh నెగటివ్‌గా ఉంటుంది. ఇక శరీరంలో ఈ బ్లడ్ ఉన్నవారు ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతుంటారట. అందుకే ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు ఇనుము అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినాలని వైద్యులు సూచిస్తుంటారు.
Also Read: గాజు అద్దాల ఓపెన్ బాత్‌రూమ్..విచిత్రాల్లోనే విచిత్రం