ఢిల్లీలో జరగనున్న జీ 20 సమావేశాలను(G20 Summit) దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సమావేశాలు ఢిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ప్రగతి మైదాన్ లో ఈ సమ్మిట్ జరగనుంది. ఈ సమావేశానికి ప్రపంచ దేశాల నుంచి అనేక మంది నాయకులు, అగ్ర నేతలు హాజరు కానున్న నేపథ్యంలో ఢిల్లీ, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు.
ఈ రెండు రోజులు కూడా ఢిల్లీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఈ పక్కన ఏమి జరిగిన కూడా వెంటనే అధికారులకు తెలిసిపోయేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే డాగ్ స్క్వాడ్స్ కూడా రంగంలోకి దిగాయి.
ప్రపంచ దేశాల నుంచి అతిథులు తరలివస్తున్న క్రమంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధిస్తున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల పాటు ఆంక్షలు కూడా విధించారు. ఈ నెల 7 రాత్రి నుంచే కూడా కొన్ని నిర్దేశిత ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లోకి రానున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఢిల్లీ నగరంలో స్విగ్గీ, జొమాటో వంటి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీతో పాటు అమెజాన్ డెలివరీలను కూడా నిషేధించారు.
ఈ 7 వ తేదీ అర్ధరాత్రి నుంచి కూడా 10 వ తేదీ అర్థరాత్రి వరకు ఢిల్లీలోకి ఎటువంటి వాహనాల ప్రవేశాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు వివరించారు. ఈ క్రమంలోనే నగరంలో ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకు కూడా సెలవు ప్రకటించారు. 9,10 తేదీల్లో అయితే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సెలవు ప్రకటించారు. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అమలు చేయాలని కంపెనీలకు ప్రభుత్వం సూచించింది. ఆంక్షలు అమలు ఉన్న నిర్దేశిత ప్రాంతాల్లో థియేటర్లు, రెస్టారెంట్లు కూడా మూసివేయాలని కూడా సూచించారు.
అయితే మూడు రోజుల పాటు ఢిల్లీలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు వచ్చిన వార్తలను మాత్రం ఢిల్లీ పోలీసులు కొట్టి పారేశారు. కేవలం కిరాణా షాపులు, ఏటీఎంలు, మెడికల్ షాపులతో పాటు అత్యవసర సేవలు అందించే సంస్థలు మాత్రమే తెరిచి ఉంటాయని అధికారులు తెలిపారు.
దేశాధినేతలు, ప్రముఖులు బస చేసే ఫైస్టార్ హోటళ్లు ఉన్న ప్రాంతాలు..వారు ప్రయాణించే మార్గాల్లో ట్రాఫిక్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఉదయపు నడక కు కూడా ప్రజలు బయటకు రావొద్దని పోలీసు అధికారులు సూచించారు. జీ 20 సదస్సును దృష్టిలో పెట్టుకొని సుమారు 300 రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే రైల్వే అధికారులు ప్రకటించారు