Yadadri: ఇక నుంచి యాద్రాద్రి టికెట్ల బుకింగ్ ఆన్ లైన్ లో! తెలంగాణలో ప్రసిద్ద పుణ్య క్షేత్రమైన యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి సన్నిధానంలో ఇక ఆన్ లైన్ బుకింగ్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఇక నుంచి భక్తులు దేవస్థాన వెబ్ పోర్టల్ ద్వారా మే 23 నుంచి ఆన్ లైన్ బుకింగ్ సేవలను వినియోగించుకోవచ్చు. By Bhavana 24 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Yadadri Temple Online Booking Service: తెలంగాణలో ప్రసిద్ద పుణ్య క్షేత్రమైన యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి సన్నిధానంలో ఇక ఆన్ లైన్ బుకింగ్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఇక నుంచి భక్తులు దేవస్థాన వెబ్ పోర్టల్ ద్వారా మే 23 నుంచి ఆన్ లైన్ బుకింగ్ సేవలను వినియోగించుకోవచ్చు. . ఇక నుంచి భక్తులు ఎవరైనా yadadritemple.telangana.gov.in website లో ఓ గంట ముందు దర్శనానికి లేదా పూజా కార్యక్రమాలకు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఈవో గా భాస్కరరావు చార్జ్ తీసుకున్న తర్వాత భారీ మార్పులు తీసుకుని వస్తున్నారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. కొంతకాలం క్రితమే యాదగిరిగుట్ట దేవస్థానంలో జరిగే ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు సంప్రదాయ దుస్తులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. జూన్ 1 నుంచి ఈ విధానంఅమల్లోకి వస్తుందని చెప్పారు. Also Read: ఎమ్మెల్యే పిన్నెల్లికి భారీ ఊరట.. హైకోర్టు కీలక ఆదేశం బ్రేక్ దర్శనాలు, నిత్యకల్యాణం, జోడు సేవలు, అభిషేకాలు, వ్రతాల్లో పాల్గొనే దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు సైతం సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని తెలిపారు. మగవారు పంచె, పట్టువస్త్రాలు, తెల్లటి దుస్తులు, మహిళలు చున్నీతో కూడిన పంజాబీ డ్రెస్ కానీ, చీరగానీ, లంగా వోణి గానీ ధరించాలని చెప్పారు. విషయం తెలియకుండా వచ్చే వారి కోసం స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. #telangana #yadadri #online-booking మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి