Onion Export Ban: ఒక పక్క రైతుల ఉద్యమాలు.. మరో పక్క ఎన్నిలకు తరుముకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) అలర్ట్ అయింది. రైతుల కోసం చెరకు మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్న ఉల్లి ధరలను (Onion Prices) నియంత్రించడానికి చర్యలు మొదలు పెట్టింది. గతంలో ఉల్లి ఎగుమతులను కేంద్రం నిషేధించింది. అప్పుడు పెరుగుతున్న ఉల్లి ధరలు అదుపులోకి వచ్చాయి. అయితే, ఈ మధ్యకాలంలో నిషేధాన్ని ఎత్తివేసినట్లుగా వార్తలు వెల్లువెత్తాయి. దీంతో ఉల్లిధరలు పెరగడం మొదలైంది. దీంతో కేంద్రం అలర్ట్ అయింది. ఉల్లి ఎగుమతులపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఉల్లి ఎగుమతిపై (Onion Exports) నిషేధాన్నిఎత్తివేసినట్లు వచ్చిన వార్తలను వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఖండించారు.
పూర్తిగా చదవండి..Onion Export Ban: ఉల్లి ధరలతో కేంద్రం ఉలిక్కిపాటు.. ఎగుమతులపై నిషేధం అలానే ఉందని ప్రకటన!
ఉల్లిధరల అంశం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేశారనే తప్పుడు వార్తలు రావడంతో మార్కెట్లో ఉల్లిధర పెరిగింది. దీంతో కేంద్రం ఉల్లి ఎగుమతులపై నిషేధంలో మార్పు లేదనీ.. ముందు చెప్పినట్టే మార్చి 31 వరకూ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
Translate this News: