OnePlus 11R 5G: ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ నుంచి సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ఈ మధ్యే లాంచ్ అయ్యింది. భారత మార్కెట్లో వన్ ప్లస్ 11 ఆర్ 5జీ సోలార్ రెడ్ వేరియంట్ పేరుతో ఈ ఫోన్ను లాంచ్ చేసింది. స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జనరేషన్ 1ఎస్ఓసీ, కర్డ్వ్ అమెల్డ్ స్క్రీన్ , 100 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో విడుదలైన ఈ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది ప్రముఖ ఇ కామెర్స్ వెబ్ సైట్ అమెజాన్. మీరు వన్ ప్లస్ శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ని చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. మీరు రోజువారీ పని కోసం ఫోన్ కొనుగోలు చేయాలనుకున్నా లేదా గేమింగ్ వంటి భారీ పనుల కోసం కొత్త ఫోన్‌ని పొందాలనుకున్నాఈ ఫోన్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ఫోన్ పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది.
వన్‌ప్లస్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో విడుదల అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీరు టాప్ నాచ్ డిస్‌ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, ఫ్లాగ్‌షిప్ లెవల్ కెమెరాను పొందుతారు. మీరు స్మార్ట్‌ఫోన్‌తో ఫోటోగ్రఫీని ఇష్టపడితే ఈ ఫోన్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై లభించే డిస్కౌంట్ ఆఫర్‌ల గురించి తెలుసుకుందాం.
భారీ తగ్గింపు ఆఫర్:
వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ఫోన్ ప్రస్తుతం ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో రూ. 39,999వద్ద కొనుగోలుకు అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం ఈ పవర్ ఫుల్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. అమెజాన్‌లో ఈ ఫోన్‌పై ప్రస్తుతం 18 శాతం తగ్గింపును ప్రకటించింది. ఫ్లాట్ తగ్గింపు తర్వాత, మీరు దీన్ని కేవలం రూ. 32,999కి కొనుగోలు చేయవచ్చు.ఫ్లాట్ తగ్గింపు తర్వాత,అదనపు డబ్బును బ్యాంక్ ఆఫర్‌లలో ఆదా చేసుకోవచ్చు.అమెజాన్ నుండి షాపింగ్ చేయడం ద్వారా, మీరు ఎంచుకున్న బ్యాంకుల కార్డ్‌లపై అదనంగా రూ. 1,250 వరకు ఆదా చేసుకోవచ్చు. మీ బడ్జెట్ తక్కువగా ఉంటే, మీరు నో కాస్ట్ ఈఎంఐపై కూడా కొనుగోలు చేయవచ్చు. మీకు ఫీచర్ రిచ్ స్మార్ట్‌ఫోన్ కావాలంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్.
స్పెసిఫికేషన్‌లు:
ఈ స్మార్ట్ ఫోన్లో మీరు పవర్ ఫుల్ ఫీచర్లను పొందుతారు. భారీ టాస్కింగ్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ బెస్ట్ ఛాయిస్. ఈ స్మార్ట్‌ఫోన్‌లో, వినియోగదారులు 6.74 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతోపాటు 120Hz రిఫ్రెష్ రేట్‌ను పొందుతారు.ఇది 1450 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉన్నందున మీరు దీన్ని సూర్యకాంతిలో సులభంగా ఉపయోగించవచ్చు. ఇందులో కంపెనీ క్వాల్కమ్ SM8475 స్నాప్ డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్‌ని అందించింది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్టోరేజ, ర్యామ్ అనేక ఆప్షన్స్ పొందవచ్చు. ఇది గరిష్టంగా 18జిబి ర్యామ్ 512జిబి స్టోరేజీ ఉంటుంది.ఇందులో 5000ఎంఎహెచ్ బ్యాటరీ ఉంది. 100W ఫాస్ట్ ఛార్జర్‌తో దీన్ని ఛార్జ్ చేయవచ్చు.
ఇది కూడా చదవండి: నెలకు రూ. 10వేల పెన్షన్ కావాలా?అయితే ఈ స్కీంలో చేరండి..!