Telangana News: 8 గంటల పాటు విద్యుత్ స్తంభంపైనే శవం.. అసలేం జరిగిందంటే?

జనగామ జిల్లా వనపర్తిలో విద్యుత్ అధికారుల సూచనతో స్తంభం ఎక్కి రిపేరు చేస్తున్న ఓ వ్యక్తి షాక్ కు గురై ప్రాణాలు కోల్పోయాడు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తేనే స్తంభం నుంచి శవం దించనిస్తామని గ్రామస్తులు 8 గంటల పాటు ఆందోళన చేపట్టారు.

Telangana News: 8 గంటల పాటు విద్యుత్ స్తంభంపైనే శవం.. అసలేం జరిగిందంటే?
New Update

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలోని వనపర్తి గ్రామంలో కుక్కల మల్లేష్(42) అనే వ్యక్తి కరెంట్‌ షాక్ కు గురై మృతి చెందారు. గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మల్లేష్ కరెంట్‌ వర్క్ చేసుకుంటూ విద్యుత్ అధికారులు చెప్పిన పనులు చేస్తూ ఉంటాడు. శుక్రవారం గ్రామంలోని ఓ ఇంట్లో విద్యుత్ సదుపాయాన్ని పునరుద్ధరించడం కోసం, అధికారులు ఎల్సీ ఇవ్వగా స్తంభం ఎక్కి రిపేర్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా కరెంట్ రావడంతో షాక్ కు గురై మృతి చెందాడు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే మల్లేష్ ప్రాణాలు కోల్పోయాడని గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

మల్లేష్ కుటుంబానికి రూ.10 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తానని హామీ ఇస్తేనే మృతదేహాన్ని కిందికి దించనిస్తామని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న స్టేషన్ ఘనపూర్ ఏసీబీ బీమ్ శర్మ సంఘటన స్థలానికి చేరుకొని ఏడి అనిల్ కుమార్, ఏ శంకరయ్యతో మాట్లాడారు. కుటుంబ సభ్యుల డిమాండ్ గురించి పై అధికారులతో మాట్లాడాలని తెలిపారు. మృతుడి కుమారుడు చరణ్, కూతురు శృతిలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తానని, ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా వస్తుందని విద్యుత్ శాఖ అధికారి ఎస్సీ వేణుమాధవ్ హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు 8 గంటల తర్వాత ఆందోళన విరమించారు.

Also read: అంబానీ వివాహ వేడుకలో టాలీవుడ్‌ స్టార్‌!

#warangal #current-shock #dead #vanaparthy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe