ఒక్క రోజు నైట్ అవుట్ చేస్తే ఇన్ని ప్రయోజనాలా! సూపర్ సీక్రెట్ బయటపెట్టిన నిపుణులు

ఒక్కరోజు రాత్రి నిద్రపోకపోవడం వల్ల మనిషి డిప్రెషన్‌ నుంచి బయటపడగలడని తాజా అధ్యయనం తెలిపింది. నైట్ అవుట్ యాంటీ డిప్రెసెంట్‌గా పని చేస్తుందని, డిప్రెషన్‌ ట్యాబ్లెట్స్ కు బదులు ఒక రాత్రి పడుకోకుండా ఉండటం బెటర్ అని నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీలోని న్యూరోబయాలజిస్టులు వెల్లడించారు.

New Update
ఒక్క రోజు నైట్ అవుట్ చేస్తే ఇన్ని ప్రయోజనాలా! సూపర్ సీక్రెట్ బయటపెట్టిన నిపుణులు

మనిషిని ఆరోగ్యంగా ఉంచడంలో నిద్ర కీలకపాత్ర పోషిస్తుందనే విషయం తెలిసిందే. అయితే అది అవసరానికి మించి ఎక్కువైతే సోమరితనం పెరిగిపోయి అనారోగ్యాలకు దారి తీస్తుంది. కానీ ప్రస్తుతం ఉద్యోగజీవితాల్లో భాగంగా కొంతమంది నిద్ర లేని రాత్రులు గడిపేస్తున్నారు. అయితే పడుకోకుండా పనిచేయడం కూడా ఎక్కువకాలం హెల్త్ కు మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇదిలావుంటే తాజాగా ఓ అధ్యయనం వన్ డే నైట్ అవుట్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. ఈ మేరకు ఒక్కరోజు రాత్రి నిద్రపోకపోవడం వల్ల మనిషి డిప్రెషన్‌ నుంచి బయటపడగలరని తెలిపింది. నైట్ అవుట్ యాంటీ డిప్రెసెంట్‌గా పని చేస్తుందని, డిప్రెషన్‌కు ట్యాబ్లెట్స్ తీసుకుని సైడ్ ఎఫెక్ట్స్‌ పొందే బదులు రాత్రి పడుకోకుండా ఉండటం బెటర్ అని సూచించింది. నిద్రలేమి డోపమైన్‌ విడుదలను పెంచుతుందని, ఇది 'లవ్ డ్రగ్'గా పని చేసి, మెదడు కనెక్షన్‌లను తిరిగి మారుస్తుందని గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు.

Also read :NVS Admissions 2024: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు.. ఇవాళే చివరి తేదీ.. అప్లై చేశారా?

అలాగే ఈ నైట్ అవుట్ వల్ల శరీరం అలసిపోవచ్చు కానీ మనసు మాత్రం హ్యాపీగా ఉంటుందని.. డిప్రెషన్ నుంచి బయటపడుతుందని తెలిపారు. నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీలోని న్యూరోబయాలజిస్టులు ఈ పంచ్-డ్రంక్ మెకానిజమ్ వెనుక ఉన్న మెకానిజమ్‌ గురించి వివరించారు. ఎలుకలలో తేలికపాటి, తీవ్రమైన నిద్ర లేమిని ప్రేరేపించడం.. ఆ సమయంలో వాటి ప్రవర్తన, మెదడు కార్యకలాపాలను విశ్లేషించడం ద్వారా డోపమైన్ విడుదలలో పెరుగుదల, మూడ్‌ను ఎలివేట్ చేసే బ్రెయిన్ రీవైరింగ్ మార్గం సినాప్టిక్ ప్లాస్టిసిటీ పెరగడాన్ని గుర్తించారు. మొత్తానికి ఒక్క రాత్రి నిద్రకోల్పోవడం.. శక్తివంతమైన యాంటీడిప్రెసెంట్ ప్రభావాన్ని ప్రేరేపిస్తుందని, మెదడును తిరిగి మారుస్తుందని కనుగొన్నట్లు నిర్ధారించిన శాస్త్రవేత్తలు.. డోపమైన్ విడుదలకు కారణమైన నాలుగు మెదడు ప్రాంతాలపై దృష్టి సారించినట్లు తెలిపారు.

ఇక తీవ్రమైన నిద్ర నష్టం తర్వాత ప్రిఫ్రంటల్ కార్టెక్స్, న్యూక్లియస్ అక్యుంబెన్స్, హైపోథాలమస్, డోర్సల్ స్ట్రియాటం ప్రాంతాలపై కాన్సంట్రేట్ చేసిన సైంటిస్టులు.. మధ్యస్థ ప్రిఫ్రంటల్ కార్టెక్స్‌లోని డోపమైన్ ఇన్‌పుట్స్ సైలెంట్ చేయబడినప్పుడు మాత్రమే యాంటిడిప్రెసెంట్ ప్రభావం అదృశ్యమవుతుందని గుర్తించారు. దీన్ని బేస్ చేసుకుని మెడిసిన్ డెవలప్మెంట్‌లో మార్పులు తీసుకురాగలమని వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు