One nation one election: మరో సంచలన బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైనట్టు సమాచారం. 'వన్ నేషన్.. వన్ ఎలక్షన్(One nation one election)' బిల్లును రానున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 18 – 22 మధ్య పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగనున్నట్టు కేంద్ర పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందస్తు వేళ్లేందుకు బీజేపీ ప్లాన్ వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రత్యేక సమావేశాలు ఎందుకో చెప్పాలని ఓవైపు యాంటీ బీజేపీ పార్టీ నేతలు నిలదీస్తుండగా.. అదే సమయంలో 'వన్ నేషన్.. వన్ ఎలక్షన్' వార్త బయటకు వచ్చింది.
ఒకేసారి అందరికి ఎన్నికలు:
సెప్టెంబరు 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ బిల్లును ప్రవేశపెట్టవచ్చని సమాచారం. ఈ 'వన్ నేషన్, వన్ ఎలక్షన్' అనేది లోక్‌సభ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని సూచిస్తుంది . ఈ ప్రతిపాదనపై గతంలో చాలాసార్లు చర్చ జరిగింది. లా కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని అధ్యయనం చేసింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న విధానానికి స్వస్తి పలకాలని కేంద్రం అడుగులు వేస్తోంది. నిజానికి లోక్‌సభ లేదా రాష్ట్రాల అసెంబ్లీలయినా.. సాధారణంగా వాటి గడువు ముగిసిన తర్వాత జరుగుతాయి. వన్ నేషన్, వన్ ఎలక్షన్ ఐడియా కింద, లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సైకిల్‌లో ఎన్నికలు జరుగుతాయి. ఓటింగ్ కూడా ఒకే రోజు జరిగే ఛాన్స్‌లు ఉంటాయి.
భారీగా పెరిగిన ఖర్చు:
నిజానికి 1967 వరకు ఎన్నికలు ఇలానే జరిగాయి. అయితే కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు మధ్యలో మెజార్టీని కోల్పోయాయి. పదవీకాలానికి ముందే అసెంబ్లీలు రద్దు ఐపోవడంతో ఈ ట్రెడిషన్‌కి బ్రేక్ పడింది. ఇక ద్రవ్యోల్బణం కారణంగా ఎన్నికల వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు.. 1952లో ఎన్నికల వ్యయం దాదాపు 10.45 కోట్లు.. ఇది 2014 నాటికి 3,870 కోట్లకు చేరింది. ముఖ్యంగా.. ఇది రవాణా, భద్రత, నిర్వహణ, పార్టీల ప్రకటనలు కాకుండా కేవలం ఎన్నికల సంఘం ఖర్చు మాత్రమే. ఒక సర్వే ప్రకారం.. గత లోక్‌సభ ఎన్నికలలో దేశం మొత్తంలో పార్టీలు దాదాపు 7 బిలియన్ డాలర్లు ఖర్చు చేశాయి. మరోవైపు సడన్‌గా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంపై ప్రతిపక్షాలు విమర్శల దాడి చేస్తున్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సాధారణంగా నవంబర్ చివరి వారంలో ప్రారంభమవుతాయి.
ALSO READ: అక్టోబర్‌లో లోక్‌సభ రద్దు? ముందస్తు ఎన్నికలు ఫిక్స్..?
Parliament's special session: వన్ నేషన్.. వన్ ఎలక్షన్.. బిల్లుకు ముహూర్తం ఫిక్స్!
‘ఒక దేశం, ఒకే ఎన్నికలు(One Nation One election)’ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైనట్టు సమాచారం. సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 22 వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సమయంలో ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. వన్ నేషన్, వన్ ఎలక్షన్ ఐడియా కింద, లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే టైమ్‌లో ఎన్నికలు జరుగుతాయి.
New Update
Advertisment