Metro: దేశంలో ప్రతిరోజూ ఎంతమంది మెట్రో రైళ్లో ప్రయాణిస్తున్నారో తెలుసా..

చాలామంది ప్రయాణికులు సులభంగా, వేగంగా తమ గమ్యస్థానాలకు చేరేందుకు మెట్రో రైళ్లో ప్రయాణాలు చేస్తుంటారు. అయితే దేశవ్యాప్తంగా నిత్యం కోటి మంది మెట్రోల్లో ప్రయాణిస్తున్నారని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి వెల్లడించారు. దేశంలో 20 నగరాల్లో దాదాపు 895 కిలోమీటర్ల మేర మెట్రో వ్యవస్థ అందుబాటులో ఉందని చెప్పారు.

Hyderabad Metro: మెట్రోలో ప్రయాణించేవారికి అలర్ట్.. సమయంలో మార్పులు
New Update

ఒకప్పుడు గమ్యస్థానాలకు చేరుకోవాలంటే బస్సులు, రైళ్లలోనే ఎక్కువగా ప్రజలు ప్రయాణాలు చేసేవారు. అయితే ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో మెట్రో రైళ్లు రావడంతో ప్రజలకు ప్రయాణం మరింత సుగమమైంది. ప్రతిరోజూ చాలామంది ఈ మెట్రో ప్రయాణాలనే ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో ప్రయాణాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ మెట్రోల్లో దాదాపు కోటి మంది ప్రయాణం చేస్తున్నారని తెలిపింది. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీలో ప్రారంభమైన 16వ అర్బన్ ఇండియా కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్న ఆయన.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 20 నగరాల్లో మెట్రో రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు.

Also Read: దేశంలో 10 వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులు.. వచ్చేవారమే టెండర్లు

అయితే ఈ 20 నగరాల్లో దాదాపు 895 కిలోమీటర్ల వరకు మెట్రో రైలు వ్యవస్థ అందుబాటులో ఉందని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరగనుందని.. మరికొన్ని రోజుల్లోనే ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో వ్యవస్థలో భారత్ రెండో స్థానం దిశగా వెళ్తోందని వ్యాఖ్యానించారు. అయితే ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ మెట్రో వ్యవస్థల ప్రతినిధులు, రవాణాశాఖ అధికారులు, ముఖ్యనేతలు, అంతర్జాతీయ నిపుణులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. మరోవైపు దేశవ్యాప్తంగా 169 నగరాల్లో దాదాపు 10 వేల ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నామని తాజాగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘పీఎం ఈ-బస్‌ సేవ’ పథకంలో భాగంగా ముందుగా మూడు వేల బస్సుల్ని సేకరించేందుకు వచ్చే వారంలోనే టెండర్లు పిలవనున్నట్లు తెలుస్తోంది. మరోవిషయం ఏంటంటే 3 లక్షల నుంచి 40 లక్షల మధ్య జనాభా ఉన్న నగరాలకే ఈ ఎలక్ట్రిక్ బస్సుల సేవలు వర్తించనున్నాయి.

Also Read: వాటే ఐడియా గురూ.. గాడిదపై వచ్చి నామినేషన్ వేశాడు..

#telugu-news #national-news #metro #metro-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి