Manipur : మణిపూర్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు...మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత..!! ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతను దృష్టిలో ఉంచుకుని పరిపాలన మరోసారి రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను 5 రోజుల పాటు నిలిపివేసింది. ఈ ఉత్తర్వులు అక్టోబర్ 1 సాయంత్రం వరకు కొనసాగుతాయి. By Bhoomi 27 Sep 2023 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడేలా లేదు. దాదాపు 5 నెలలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న రాష్ట్రంలో మరోసారి పరిస్థితి చేజారిపోయింది. ఇంఫాల్ లో ఇద్దరు విద్యార్థులను గుర్తుతెలియని దుండగులు హత్య చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం వందలాది మంది విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భద్రతా బలగాల ఘర్షణలో 34మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి చేజారిపోవడంతో మణిపూర్‌లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు సెప్టెంబర్ 26 రాత్రి 7:45 నిలిపివేశారు. ఈ అడ్మినిస్ట్రేషన్ ఆర్డర్ 5 రోజుల పాటు అమల్లో ఉంటుంది. అంటే అక్టోబర్ 1, 2023 రాత్రి 7:45 గంటల వరకు ప్రజలు ఇంటర్నెట్ సేవను ఉపయోగించలేరు. మొబైల్ ఇంటర్నెట్ డేటా సర్వీస్, VPN ద్వారా కూడా ప్రజలు ఇంటర్నెట్‌ను ఉపయోగించలేరని పరిపాలన ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఈ మేరకు దర్యాప్తు సంస్థ ఏఎన్‌ఐ ట్వీట్ చేసింది. Mobile internet data services, internet/data services through VPN suspended in the territorial jurisdiction of Manipur for five days with immediate effect till 7:45 PM of 1st October 2023. pic.twitter.com/xZEuZUmmuJ — ANI (@ANI) September 26, 2023 పరిపాలన జారీ చేసిన ఉత్తర్వులో, 'మణిపూర్ రాష్ట్రంలోని ప్రస్తుత శాంతి భద్రతల దృష్ట్యా, రాష్ట్ర ప్రభుత్వం చాలా సున్నితంగా ప్రచారం, తప్పుడు పుకార్లు, ఇతర రకాల వార్తల వ్యాప్తిని తీవ్రంగా పరిగణిస్తోంది. హింసాత్మక కార్యకలాపాలు, టాబ్లెట్‌లు, కంప్యూటర్‌లు, మొబైల్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా పెద్ద సంఖ్యలో MMS పంపడం వల్ల ఆందోళనకారులు, నిరసనకారులు గుమిగూడి, ప్రాణనష్టం లేదా ప్రజా ఆస్తులు నష్టపోయే అవకాశం ఉందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇది కూడా చదవండి: ఇరాక్‌లో ఓ వివాహ వేడుకలో భారీ అగ్నిప్రమాదం..100మంది మృతి..!! సుమారు 5 నెలల తర్వాత ఇంటర్నెట్ సేవ పునరుద్ధరించబడిన తర్వాత, ఇద్దరు విద్యార్థుల మృతదేహాల చిత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు న్యాయం చేయాలంటూ రాజధాని ఇంఫాల్‌లో వందలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు. సీఎం కార్యాలయాన్ని అడ్డుకునే ప్రయత్నాం చేశాయి. దీంతో భద్రతా బలగాలు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి విద్యార్థులను చెదరగొట్టాయి. ఈ సమయంలో పలువురు విద్యార్థులు కూడా గాయపడి చికిత్స పొందుతున్నారు. ఇది కూడా చదవండి: వారం రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న సీఎం కేసీఆర్ కాగా మణిపూర్ సర్కార్ విద్యార్థుల హత్యకేసును సీబీఐకి అప్పగించింది. నేరస్తులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు కూడా సెర్చ్ ఆపరేషన్ లో మొదలుపెట్టాయి. విద్యార్థుల అదృశ్యానికి గల కారణాలతోపాటు నిందితులను గుర్తించేందుకు రాష్ట్ర పోలీసులు, కేంద్ర భద్రతా సంస్థల సహకారంతో కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఎం సచివాలయ అధికారి తెలిపారు. #schools #manipur-violence #imphal #internet-suspended #protest-erupts #shut మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి