Delhi: ఎలక్షన్ కౌంటింగ్‌లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM) ఓట్లతో వీవీప్యాట్ (VVPAT) స్లిప్‌లను క్రాస్ వెరిఫై చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) గురువారం విచారణ జరిపింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత గురించి ఆరా తీసిన ధర్మాసనం.. ఎన్నికల నిర్వహణ పవిత్రంగా ఉండాలంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.
బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయని..
ఈ మేరకు పిటిషన్‌పై వాదనలు వినిపించిన అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫామ్స్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్.. ఇటీవల కేరళలో జరిగిన మాక్ పోల్ గురించి న్యాయస్థానం ముందు ప్రస్తావించారు. కాసర్‌గోడ్‌లో మాక్ ఓటింగ్ జరిగగా.. అక్కడ నాలుగు ఈవీఎంలను వీవీప్యాట్లతో సరిపోలిస్తే బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయని వివరించారు. దీంతో ఈ వ్యవహారాన్ని పరిశీలించాలంటూ ఎన్నికల సంఘానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ‘ఎన్నికల నిర్వాహణలో పవిత్రత చాలా అవసరం. సమన్వయంగా జరగట్లేదని ఎవరూ భావించకూడదు. ఓటర్లు, ప్రజలు ఎవరూ ఆందోళనలకు గురి కాకుండా జాగ్రత్తలు చూసుకోవాలి' అని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Bollywood: గర్ల్ ఫ్రెండ్ తో బూట్లు నాకించిన స్టార్ హీరో.. దుమ్మెత్తి పోస్తున్న నటులు!
అలాగే ఓటింగ్ ప్రక్రియలో ఎలాంటి విధానాలను పాటిస్తున్నారంటూ ఈసీని వివరణ కోరింది. ఇక న్యాయస్థానం ప్రశ్నలకు స్పందంచిన ఈసీ.. తమ నిర్వహించే ప్రక్రియ గురించి కోర్టుకు వివరించింది.