Income Tax : పాత vs కొత్త పన్ను విధానాల్లో ఏది బెస్ట్ ఆప్షన్..? జీతభత్యాల ఉద్యోగులకు ఏది మంచిది?

కేంద్ర బడ్జెట్ 2023-24లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ట్యాక్స్ శ్లాబులను సవరించారు. రివైజ్డ్ ట్యాక్స్ స్ట్రక్చర్ ను అమలు చేశారు. సర్కార్ కొత్త పన్ను విధానాన్ని డిపాల్ట్ గా పేర్కొంది. అయితే పాత పన్ను విధానాన్ని ఎంచుకునే అవకాశాన్ని కూడా కల్పించింది.

Income Tax : పాత vs కొత్త పన్ను విధానాల్లో ఏది బెస్ట్ ఆప్షన్..? జీతభత్యాల ఉద్యోగులకు ఏది మంచిది?
New Update

Income Tax : మనదేశంలో ప్రతిఏటా పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని సంపాదిస్తున్న వ్యక్తులు తప్పనిసరిగా పన్ను చెల్లించాలి. ఒక వ్యక్తి లేదంటే కంపెనీ వారి ఆదాయానికి అనుగుణంగా చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని ట్యాక్స్ శ్లాబ్ నిర్దేశిస్తుంది. కేంద్రబడ్జెట్ 2023-24లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్యాక్స్ శ్లాబ్స్ ను సవరించారు. రివైజ్డ్ ట్యాక్స్ స్ట్రక్చర్స్ ను అమలు చేశారు. కొత్త పన్ను విధానాన్ని సర్కార్ డిఫాల్ట్ గా పేర్కొంది. అయితే పాత పన్ను విధానాన్ని ఎంచుకునే అవకాశాన్ని కూడా కల్పించింది.

అయితే గత ఏడాది బడ్జెట్‌లో, కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను రేట్లలో ప్రభుత్వం అనేక మార్పులను ప్రకటించింది. పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం ఈ రెండింటీపై ఇప్పటికీ చాలా మందికి అనేక సందేహాలు ఉన్నాయి.బడ్జెట్ 2023 ప్రకారం అనేక సవరణల కారణంగా పాత, కొత్త పన్ను విధానాల మధ్య ఎంపికకు సంబంధించి పన్ను చెల్లింపుదారులలో చాలా గందరగోళం ఉంది. అసలు పాత వర్సెస్ కొత్త పన్ను విధానాల్లో ఏది బెస్ట్. వీటి మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం.

కొత్త పన్ను విధానం:

కొత్త ఆదాయ పన్ను విధానంలో ట్యాక్స్ శ్లాబులను తగ్గించారు. రూ. 3లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవాళ్లు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. రూ. 3లక్షల నుంచి రూ. 6లక్షల వరకు వార్షిక ఆదాయం ఉంటే 5శాతం పన్ను రేటు వర్తిస్తుంది. అయితే కొత్త పన్ను విధానంలో రూ. 7లక్షల వరకు ఆదాయానికి పన్ను రాయితీ వర్తిస్తుంది. మీ వార్షిక ఆదాయం రూ. 7లక్షలు లేదా అంతకంటే తక్కువగా ఉంటే పన్ను రాయితీకి అర్హత ఉంటుంది. చెల్లించాల్సిన పన్ను జీరోకి తగ్గుతుంది. అంటే మొత్తం ఆదాయం ట్యాక్స్ ఎగ్జమ్షన్ పొందినట్లవుతుంది.

సంవత్సరానికి రూ. 6లక్షల నుంచి రూ. 9లక్షల వరకు సంపాదిస్తున్న వారు 10శాతం పన్ను, రూ. 9లక్షల నుంచి రూ. 12లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారు 15శాతం ట్యాక్స్ కట్టాలి. రూ. 12లక్షల నుంచి రూ. 15లక్షల వార్షిక ఆదాయాన్ని కవర్ చేసే వారు ఆదాయంలో 20శాతం ట్యాక్స్ కట్టాల్సిందే. రూ. 15లక్షలు దాటిన వారందరికీ చివరి పన్ను శ్లాబ్ 30శాతం పన్ను అప్లయ్ అవుతుంది. అలాన్ సర్ ఛార్జ్ నిర్దిష్ట ఇన్ కమ్ బ్రాకెట్ లకు వర్తిస్తుంది. రూ. 50లక్షల కంటే ఎక్కువ అయితే 10శాతం రూ. 1 కోటిపైన 15శాతం రూ. 2కోట్ల పైన 25శాతం ఉంటుంది.

పాత పన్ను విధానం:

పాతపన్ను విధానంలో 7 ట్యాక్స్ శ్లాబులు ఉన్నాయి. చెల్లించాల్సిన ట్యాక్స్ నిల్ నుంచి ఇన్ కమ్ 30శాతం వరకు ఉంటుంది. రూ. 2.5లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులు ఆదాయపన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. రూ. 2.5 నుంచి రూ. 5లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు 5శాతం ట్యాక్స్ చెల్లించాలి. అదే వార్షిక ఆదాయం రూ. 5లక్షల నుంచి రూ. 7.5లక్షల వరకు ఉంటే మొత్తం ఆదాయంలో 10శాతం ఇన్ కమ్ ట్యాక్స్ ఉంటుంది. అదే వార్షిక ఆదాయం రూ. 7.5నుంచి రూ. 10లక్షల వరకు ఉన్నవాళ్లు ఇన్ కమ్ లో 15శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి రూ. 10లక్షల నుంచి రూ. 12.5లక్షల వరకు సంపాదించేవారు 20శాతం రూ. 12.5 లక్షల నుంచి రూ. 15లక్షల మధ్య ఆదాయం పొందేవారు 25శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ. 15లక్షలకు మించి వార్షిక ఆదాయం ఉంటే అత్యధికంగా 30శాతం ట్యాక్స్ కట్టాలి.

రెండింటిలో ఏది బెస్ట్?

ఏపన్ను విధానం బెస్ట్ అనేది ట్యాక్స్ చెల్లింపుదారుని ఆదాయం, పెట్టుబడులు, డిడక్షన్స్ పై ఆధారపడి ఉంటుంది. మీకు తక్కువ ఇన్ కమ్ స్ట్రక్చర్ లిమిటెడ్ డిడక్షన్స్ ఉంటే కొత్త పన్ను విధానం ప్రయోజకరంగా ఉంటుంది. అయితే మీరు ఎక్కువ పెట్టుబడులను కలిగి ఉంటే లేదా అనేక డిడక్షన్స్ క్లెయిమ్ చేయించాల్సి వస్తే పాత పన్ను విధానం ద్వారా మరింత ఆదా చేసుకోవచ్చు. అయితే సరైన పన్ను విధానాన్ని ఎంపిక చేసుకునేందుకు ట్యాక్స్ అడ్వైజర్ సలహా తీసుకోవడం అన్నివిధాలా మంచిది.

ఇది కూడా చదవండి : 7వ శుక్రవారం నాడు ఈ పరిహారం చేస్తే…ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడం ఖాయం..!!

#personal-finance #money #income-tax
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe