కళేబరాలతో కల్తీ నూనె... బయటపెట్టిన ఆర్టీవీ

మహబూబ్ నగర్ జిల్లా తాటికొండ గ్రామ శివార్లలో జంతు కళేబరాలతో నూనెను తయారు చేసే కంపెనీ బాగోతాన్ని RTV బయటపెట్టింది. ఈ కంపెనీ నుంచి వచ్చే దుర్వాసనతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ కంపెనీపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆందోళన చేస్తున్నారు.

కళేబరాలతో కల్తీ నూనె... బయటపెట్టిన ఆర్టీవీ
New Update

మహబూబ్ నగర్ జిల్లా తాటికొండ గ్రామ శివార్లలో దాదాపుగా 20 ఏళ్లుగా జంతు కళేబరాలతో నూనె తయారుచేసే కంపెనీ  నడిపిస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. అక్రమ అదాయమే లక్ష్యంగా  జంతు కళేబరాలతో విషపూరిత మైన నూనె తయారు చేస్తున్నారు గ్రామస్తులంతా నిన్నటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి.జాతీయ రహదారికి దాదాపు రెండు కిమీ దూరంలో ఉన్న ఈ కంపెనీకి ఓ వైపు గాజుల పేట గ్రామం, మరో రెండు వైపులా   తాటికొండ ,  ఇప్పలి పల్లి గ్రామాలున్నాయి, ఈ మూడు గ్రామాలకు కంపెనీ వల్ల వచ్చే దుర్వాసన కారణంగా శ్వాశ కొస వ్యాధులు , రకరకాల అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆందోళన చేస్తున్నారు.

నిజంగా లోపల ఏం జరుగుతోంది?

చుట్టూ నిర్మానుష్య వాతావరణం .. లోపల అంతా కుప్పలు కుప్పలుగా  జంతు కళేబరాలు , వీటి నుంచి వచ్చే విపరీతమైన దుర్వాసన కారణంగా శ్వాస కొశ  వ్యాధులు, మెదడు వ్యాపు వ్యాధులు వస్తున్నాయి. అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. లోపల చూస్తుంటే ఓ పెద్ద సామ్రాజ్యమే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రాత్రి వేళల్లో హైద్రాబాద్ తదితర ప్రాంతాల నుంచి జంతు కళేబరాలను తీసుకువచ్చి ఇక్కడ ఉన్న మెషినరీ తో ఆయిల్ గా మారుస్తున్నారు.హోటల్స్, మిగిలిన వ్యాపార కార్యకలాపాలకు ఈ నూనె ను చవక ధరకు విక్రయిస్తుంటారు. ఎన్నో సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా సరే..వాళ్లకు ముట్టాల్సిన మామూళ్లు వాళ్లకు ఇస్తుండటంతో ఎవరూ ఈ కంపెనీ పై చర్యలు తీసుకోవడం లేదు. ఎప్పుడయినా ఆందోళన చేస్తే..హడావిడిగా అధికార్లు వచ్చి హై డ్రామా నడిపి ఓ రెండు నెలలు కంపెనీ సీజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసేస్తారు. ఎక్కడ చూసినా జంతు కళేబరాలు ..దుర్వాసన .  ఇప్పటికైనా కంపెనీ ఎత్తివేసి ..ఇక్కడ నుంచి తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కళేబరాలను ముక్కలు ముక్కలుగా చేసి నూనె తయారు చేస్తారు.వాటి నుంచి వచ్చిన వ్యర్డాలతో డాల్డా, కోళ్ల దాణా,పశువుల దాణా తయారు చేస్తారు. ఈ విషయం పై RTV రిపోర్టర్ ఆ కంపనీ యాజమాన్యంతో మాట్లాడగా ఇక్కడ కేవలం పశువుల దాణా, కోళ్ల దాణా మాత్రమే తయారు చేస్తామని చెప్తున్నారు.
పేరు లేని కంపెనీ 
ఈ కంపెనీలో పని చేసేవర్కర్లు బయట రాష్ట్రాల వారుకావడంతో బయటివారు  ఎవరయినా లోపలకి వచ్చే ప్రయత్నం చేస్తే ఏం చేయడానికైనా వెనకాడరు.కనీశం నేఁ బోర్డు కూడా లేని ఈ కంపెనీ చట్ట విరుద్ద్దంగా నడుస్తోందని అర్ధమవుతోంది.  పండగ సమయం కావడంతో భారీగా జంతు కళేబరాలు లోడ్ వస్తుండగా  కొంతమంది యువకులు అడ్డుకుంటే .. ఆ యువకులను సైతం  కొట్టారని.. స్థానికులు ఆందోళన చేస్తున్నారు,. ఇప్పటికైనా అధికారులు ఈ కంపెనీ పై కఠిన చర్యలు తీస్కుని ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కాపాడాలని గ్రామస్తులు  డిమాండ్ చేస్తున్నారు.

ALSO READ: చంద్రబాబు కేసు విచారణ… చివరిలో ఊహించని ట్విస్ట్!

#telangana #mahabubnagar #oil #oil-adulterated-with-animal-carcasses
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe