Telangana : తెలంగాణలో పోలింగ్‌కు సర్వం సిద్ధం

తెలంగాణలో రేపు 17 ఎంపీ స్థానాలకు, ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. పోలింగ్ కోసం అధికారులు చకాచకా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది ఈవీఎంలను చేరవేస్తున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది

New Update
Telangana : తెలంగాణలో పోలింగ్‌కు సర్వం సిద్ధం

Polling : తెలంగాణ(Telangana)లో రేపు 17 ఎంపీ స్థానాలకు, ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక(Election) జరగనుంది. పోలింగ్ కోసం అధికారులు చకాచకా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది ఈవీఎంలను చేరవేస్తున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది.

Also read: ఏపీలో విషాదం.. ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకొడుకు మృతి

మరోవైపు 17 లోక్‌సభ స్థానాల్లో మొత్తం 525 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సికింద్రాబాద్‌లో అత్యధికంగా 45 మంది.. అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 12 మంది పోటీలో ఉన్నారు. తెలంగాణలో మొత్తం 3.17 కోట్ల మంది ఓటర్లు(Voters) ఉన్నారు. అందులో సర్వీస్ ఓటర్లు 15,338 మంది ఉన్నారు. ఇప్పటికే 14 వేల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Also Read: ఖమ్మంలో ఇన్నోవా కారు పల్టీలు.. బయటపడ్డ నోట్ల కట్టలు

Advertisment
తాజా కథనాలు