TS: ఉద్యోగుల వయో పరిమితి ఇష్యూ.. వార్తలపై క్లారిటీ ఇచ్చిన అధికారులు.. ఏమన్నారంటే!

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణకు సంబంధించి 33 ఏళ్ల సర్వీస్ లేదా 61 సంవత్సరాల వయో పరిమితి తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం ఏవిధమైన ప్రతిపాదన చేయలేదని స్పష్టం చేశాయి.

TS: ఉద్యోగుల వయో పరిమితి ఇష్యూ.. వార్తలపై క్లారిటీ ఇచ్చిన అధికారులు.. ఏమన్నారంటే!
New Update

Congress On Government Employees Retirement Age: 'రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణకు సంబంధించి 33 ఏళ్ల సర్వీస్ లేదా 61 సంవత్సరాల వయో పరిమితి ఏది ముందైతే అది తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ అంశంపై ప్రభుత్వ స్థాయిలో ఏవిధమైన ప్రతిపాదన కానీ, ఫైల్ నిర్వహణ లేదని స్పష్టం చేశాయి.

చట్టరీత్యా కఠిన చర్యలు..

ఈ మేరకు ఈ విధమైన వూహ జనిత వార్తలు రాయడం, దీనిని సామాజిక మాధ్యల్లో ప్రసారం చేయడం సరైంది కాదని పేర్కొంది. ఇలాంటి అవాస్తవ వార్తలు ప్రచురించే / ప్రచారం చేసే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకునే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని స్పెషల్ కమీషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ ఒక అధికార ప్రకటనలో తెలిపింది.

Also Read: షర్మిల పర్యటనను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు.. అవినాష్‌ రెడ్డికి గట్టి కౌంటర్‌

#telangana #information-civil-relations-department #retirement-age
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe