ఆఫీస్(Office) చాలా మందికి రెండో ఇల్లు లాంటిది. రోజుకు 8 నుంచి 10 గంటలు ఆఫీస్‌లో ఉంటారు. మీరు 1.5 నుంచి 2 సంవత్సరాలు ఒకే కార్యాలయంలో ఉంటే.. మీకు కంపెనీ అన్ని నియమాలు బాగా తెలుసే ఉంటుంది. పండుగలు లేదా ప్రత్యేక రోజులు ఆఫీస్‌లో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇది మీ కోలిగ్స్‌తో మీకు మంచి బంధాన్ని కలిగిస్తుంది. అయితే ఎంత క్లోజ్ అయినా ఆఫీస్‌లో కొన్ని మర్యాదలు పాటించాల్సిందే. ఇది మీ ప్రొఫెషనలిజాన్ని చూపించడమే కాకుండా సహోద్యోగులు, సీనియర్ల ముందు మీ ఇమేజ్ ను మంచిగా ఉంచడానికి మీకు సహాయపడుతుంది. ఆఫీసులో ఉన్నప్పుడు చేయకూడదని విషయాలేంటో ఇప్పుడు చూద్దాం.
చాలాసార్లు మనకు తెలియకుండానే ఆఫీసులో కూర్చొని భుజాల మీద నుంచి, నడుము నుంచి వంగి కూర్చుంటాం. ఇది మనకు సోమరితనం లేదా పని పట్ల ఆసక్తి లేదని చూపిస్తుంది. కాబట్టి ఆఫీసు కుర్చీలో తిన్నగా కూర్చోవాలి. ఇది మీ వెన్నును గాయపరచకుండా చేస్తుంది కూడా. మీరు పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నారని అందరికి అర్థం అయ్యేలా చేస్తుంది. అడ్డదిడ్డంగా కూర్చుంటే మనకు తెలియకుండానే మన చుట్టూ అదే వాతావరణాన్ని సృష్టిస్తాం.
పని లేదా మరేదైనా మాట్లాడేటప్పుడు ఎవరి శరీరాన్ని అనవసరంగా తాకవద్దు. మీకు మంచి స్నేహితుడు లేదా స్నేహితురాలు ఉన్నప్పటికీ.. మీరు ఆఫీసులో దీనికి ఒక పరిమితిని నిర్ణయించుకోవాలి.
ఏ కారణం చేతనైనా ఎవరితోనూ చాలా దగ్గరగా నిలబడకండి. వారు ఒకరి వ్యక్తిగత ప్లేస్‌ను ఆక్రమించారని వారు భావించవచ్చు. ఇది వారికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆఫీసులో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొంత దూరం ఉండాలి.
అవతలి వ్యక్తి మీతో పని లేదా మరేదైనా గురించి మాట్లాడుతున్నట్లయితే.. వారికి అంతరాయం కలిగించవద్దు. ఎందుకంటే అలా చేయడం వల్ల వారు చెప్పేది వినడానికి మీకు ఆసక్తి లేదని వారికి అనిపించవచ్చు.
మీటింగ్‌లో లేదా ముందు ఆఫీస్ బిజీ టైమ్‌లో మొబైల్ ఫోన్ ఉపయోగించడం మానుకోండి. ఎందుకంటే అవతలి వ్యక్తి పని చేస్తున్నప్పుడు మీరు ఫోన్ మాట్లాడుతున్నారంటే.. అది వారిని అగౌరవపరిచినట్లే లెక్కా. అవతలి వ్యక్తి చెప్పేది మీరు విస్మరిస్తున్నారనే సందేశాన్ని కూడా పంపే అవకాశం ఉంది. ఎక్కువసేపు మాట్లాడాల్సిన కాల్ అయితే ఆఫీస్ స్పెస్ నుంచి బయటకు వెళ్లి మాట్లాడండి.
Also Read: లోటస్ పాండ్ కు జగన్.. తల్లి విజయమ్మతో భేటీ!
WATCH: