/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/biden-2.jpg)
Jo Biden: గత కొంత కాలంగా అమెరికా దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఏ సమయంలో ఎలా ఉంటాడో..ఏం చేస్తాడో అర్థం కావట్లేదు. ఈ మధ్యకాలంలో ఆయన చాలాసార్లు స్టేజిపై అనుకోని సంఘటనల ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కసారిగా మనిషి ఫ్రీజ్ అయిపోవడం, లేకపోతే మరోవైపు చూస్తుండడం, ఎవరు లేకపోయినప్పటికీ అక్కడ ఎవరో ఉన్నట్లు అభివాదం చేయడం లాంటి పనుల వలన ఆయన ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
Biden almost kissed the wrong woman before Jill stepped in and saved him. He’s sharp as a tack. pic.twitter.com/0lLKhKUwDp
— @amuse (@amuse) July 18, 2024
మరికొందరైతే ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో ప్రెసిడెంట్ పదవి ఎందుకు అంటూ ఆయన పై విమర్శలు కురిపిస్తున్నారు. ఇకపోతే మరికొద్ది రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. సరిగ్గా ఇప్పుడు అమెరికా అధ్యక్షునిపై ఆయన ఆరోగ్యం గురించి డిస్కషన్ ఎక్కువైంది. తాజాగా ఆయనకు కోవిడ్ కూడా వచ్చింది.
ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోలో స్టేజ్ పైన ఉన్న ఆయన పక్కనే ఉన్న మహిళతో మాట్లాడుతున్న సమయంలో ఉన్నట్టుండి కాస్త ముందుకు వచ్చాడు. తనతో ఉన్న మహిళను ముద్దు పెట్టడానికి ప్రయత్నం చేశాడు. దాంతో వెంటనే ఆయన భార్య జిల్ బైడెన్ చేరుకొని ఆయనను అలర్ట్ చేశారు. దాంతో బైడెన్ కూడా నేను ఏదో తప్పు చేస్తున్నట్లుగా భయపడినట్లు వీడియోలో కనపడుతుంది.
ఈ వీడియో కాస్త పాతది అయినా ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్స్ అమెరికా అధ్యక్షుడిని తీవ్రంగా దుయ్యబట్టారు.