International Pasta day: అక్టోబర్ 25.. పాస్తా తినడానికో రోజు!

పాస్తా....ఈరోజుల్లో ఇది తెలియని వారు, తినని వారు...ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. తినడానికి ఈజీగా ఉండే ఈ ఇటాలియన్ డిష్ ఇప్పుడు అన్ని చోట్లా ఈజీగా దొరుకుతోంది కూడా. మనం ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు కూడా. ఇంత ఫేమస్ అయిన ఈ డిష్ కు ఒక రోజు ఉంది. అక్టోబర్ 25న పాస్తాను ఎంజాయ్ చేయండి....సెలబ్రేట్ చేసుకోండి అంటున్నారు.

New Update
International Pasta day: అక్టోబర్ 25.. పాస్తా తినడానికో రోజు!

నాగరికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ మనుషులు, దేశాల మధ్య దూరాలు తగ్గిపోతున్నాయి. ఎవరు ఎక్కడి వారైనా ఇట్టే క్షణాల్లో కనెక్ట్ అయిపోతున్నారు. అలాగే వారి అలవాట్లు, ఆహారాలు కూడా మన చెంతకే వచ్చేస్తున్నాయి. అలా అన్ని దేశాల ఫుడ్స్...మనకు అందుబాటులో వచ్చేశాయి. అవి మన టేస్ట్ బడ్స్ ను మరింత టేస్టీగా చేసేస్తున్నాయి. అలా వచ్చి ఫేమస్ అయిందే పాస్తా. దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి....తయారు చేసే విధానాలు కూడా చాలా రకాలుగా ఉన్నాయి. ఎలా చేసినా కూడా పాస్తా టేస్టీగానే ఉంటుంది. అందరికీ నచ్చుతుంది కూడా.

Also Read:ఈ రాత్రికే కాంగ్రెస్ సెకండ్ లిస్ట్.. కానీ ఓ బిగ్ ట్విస్ట్?

ప్రపంచం మొత్తం మీద 600 రకాల పాస్తాలు ఉన్నాయి. స్పెగట్టీ అన్నా, నూడుల్స్ అన్నా, చౌమీన్ అన్నా, ఫెటుసిన్ అన్నా.. అన్నీ పాస్తాలో భాగమే. ఇందులో రకరకాలు షేప్ లు కూడా ఉంటాయి. ఇటాలియన్ స్పెగట్టీ ఎంత ఫేమస్సో.... చైనీస్ చౌమీన్ కూడా అంతే ఫేమస్.

1995లో మొట్టమొదటిసారిగా పాస్తా డే ను సెలబ్రేట్ చేశారు. ప్రపంచం మొత్తంలో ఉన్న పాస్తా ఎక్సెపెర్ట్స్ అందరూ ఒక చోట కలిసి ఆ రోజున డిస్కస్ చేసుకున్నారట. పాస్తాకు ఉన్న కల్చరల్ అండ్ కలనరీ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకున్నారుట కూడా. వరల్డ్ పాస్తా కాంగ్రెస్ అని ఒక గ్రూప్ కూడా పెట్టుకున్నారు. అప్పటి నుంచి ప్రతీ ఏడాది ఈ రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

ఏ ఫుడ్ రోజు అయినా కూడా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఈజీ. అలాగే పాస్తా రోజును కూడా. ప్రపంచంలో ఉన్న పాస్తాలలో ఏదొక దాన్ని ఎంచుకోండి...మీకు నచ్చిన ప్లేస్ కు వెళ్ళో లేదా ఇంట్లోనో తయారు చేసుకుని తినేయండి అంతే. అంతేకాదు.. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ను కూడా పిలిచి వాళ్ళకు కూడా పెట్టేయండి.

Also Read:ఫలించిన కేసీఆర్ వ్యూహం.. రోడ్ రోలర్ సింబల్ కు చెక్.. ఎలాగో తెలుసా?

Advertisment
తాజా కథనాలు