రానున్న రోజుల్లో పేద, మధ్య తరగతి వర్గాల వారికి పోషకాహారం అనేది అందని ద్రాక్షలానే తయారయ్యేట్లుంది. పెరుగుతున్న ధరల వల్ల పేద, మధ్య తరగతి వారు సరైన పోషకాహారాన్ని తీసుకోలేకపోతున్నారు. అభివృద్ది చెందుతున్న దేశంలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే.. అత్యంత తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో ఈ పరిస్థితులు రోజురోజుకి మరింత పెరుగుతున్నాయి.
ఇప్పటికే మన దేశంలోని పలు ప్రాంతాల్లోని చాలా మంది పేద, మధ్య తరగతి వర్గాల వారు పోషకాహారం లోపంతో బాధపడుతున్నట్లు కొన్ని సర్వే సంస్థలు వెల్లడించాయి. దేశ వ్యాప్తంగా 20 రకాల న్యూట్రిషన్ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించినట్లు కొన్ని అధ్యయన సంస్థలు తెలిపాయి.
ఎక్కువగా పోషకాహార లోపంతో బాధపడేవారిలో గర్భిణులు, చిన్నారులు న్యూట్రిషనల్ సప్లిమెంట్లు, గర్భిణుల పోషకాహారం లోపంతో బాధపడుతున్నట్లు అధ్యయానాలు తేల్చి చెప్పాయి.
Also Read: ఈ ఏడాది వేతనాలు ఎంత శాతం పెరిగే అవకాశలున్నాయంటే!