NTR: ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించుకున్న ఎన్టీఆర్, రిషబ్, ప్రశాంత్ నీల్.. ఫొటోలు వైరల్..!

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో కన్నడ హీరో రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ కూడా తారక్ తో కలిసి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.

New Update
NTR: ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించుకున్న ఎన్టీఆర్, రిషబ్, ప్రశాంత్ నీల్.. ఫొటోలు వైరల్..!

NTR-Rishab Shetty: టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సమేతంగా కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి మంగళూరు ఎయిర్ పోర్ట్ లో తారక్ ను రిసీవ్ చేసుకున్నారు. అనంతరం రిషబ్ శెట్టి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. తారక్ ఫ్యామిలీతో కలిసి ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించుకున్నారు. అంతే కాదు ఈ ముగ్గురు కలిసి అక్కడ భోజనం కూడా  చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తారక్ అమ్మమ్మ ఊరు మంగుళూరు దగ్గరలోని కుందాపుర. హీరో రిషభ్ శెట్టిది కూడా అదే ఊరు. తారక్ తన అమ్మ కోరిక మేరకు తన అమ్మమ్మ ఊరిని ఫ్యామిలీతో కలిసి సందర్శించడానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక తారక్ సినిమాల విషయానికి వస్తే.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఆ తర్వాత హృతిక్ రోషన్ వార్ 2, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో మరో భారీ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి 'డ్రాగన్' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం.

Also Read: Kangana Ranaut: చంపేస్తామని బెదిరింపులు ... నిలిచిపోయిన కంగనా 'ఎమర్జెన్సీ' సెన్సార్ సర్టిఫికేట్! - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు