ఇది ఇలా ఉంటే కంగనా ‘ఎమర్జెన్సీ’ మూవీ విడుదలకు ముందే వివాదాలను చుట్టుముట్టింది. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ (Censor Certificate) జారీ ఇవ్వకపోవడం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని కంగనా స్వయంగా చెప్పింది. తాను నటించిన ‘ఎమర్జెన్సీ’ కి సెన్సార్ సర్టిఫికెట్ రాలేదని వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో కంగనా మాట్లాడుతూ.. మా సినిమా క్లియర్ చేయబడింది.. కానీ మాతో పాటు సెన్సార్ బోర్డుకు కూడా బెదిరింపులు వస్తునందున సర్టిఫికేషన్ నిలిపివేయబడింది. సినిమాలో ఇందిరా గాంధీ మరణాన్ని చూపించవద్దని, జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేను చూపించవద్దని, పంజాబ్ అల్లర్ల దృశ్యాలు చూపించవద్దని చెబుతున్నారు. మరి ఏమీ చూపించాలి అనేది మాపై ఒత్తిడిగా మారింది అని తన ఆవేదన వ్యక్తం చేసింది.
పూర్తిగా చదవండి.. [vuukle]Kangana Ranaut: చంపేస్తామని బెదిరింపులు … నిలిచిపోయిన కంగనా ‘ఎమర్జెన్సీ’ సెన్సార్ సర్టిఫికేట్!
నటి కంగనా రనౌత్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరలవుతోంది. కంగనా తాను నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఇంకా సర్టిఫికేట్ ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. బెదిరింపుల కారణంగా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేయడంలో ఆలస్యం చేస్తున్నారని తెలిపింది.
Translate this News:
Kangana Ranaut Emergency Movie: బాలీవుడ్ నటి, హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎమర్జెన్సీ’. దివంగత భారత ప్రధానీ ఇందిరాగాంధీ (Indira Gandhi) జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో కంగనా ఇందిరాగాంధీ పాత్ర పోషించారు. ఎమర్జెన్సీ టైంలో దేశంలో చోటుచేసుకున్న పరిణామాలు, అప్పుడు ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలు ఏంటనే నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 6న థియేటర్స్ లో విడుదల కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు!