/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-2024-09-01T155302.628.jpg)
NTR- Prashanth Neel: టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ నిన్న తన తల్లి షాలిని, సతీమణీ ప్రణతీతో కలిసి కర్ణాటక కుందాపురాలోని ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించుకున్నారు. అమ్మ షాలిని కోరిక మేరకు తన అమ్మ స్వగ్రామమైన కుందపురాలోని ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించుకున్నట్లు ట్వీట్ కూడా చేశారు తారక్. కన్నడ హీరో రిషబ్ శెట్టి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ తో కలిసి దర్శనంలో పాల్గొన్నారు.
ఇది ఇలా ఉంటే.. దర్శనం అనంతరం సాయంకాలం తారక్, డైరెక్టర్ ప్రశాంత నీల్ బీచ్ లో సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. బీచ్ లో తమ సతీమణులతో కలిసి దిగిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎల్లప్పుడూ షూటింగ్ లతో బిజీబిజీగా ఉండే తారక్ కాస్త టైమ్ దొరకడంతో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో సరదా గడుపుతున్నారు.
#NTR and #PrashanthNeel with their family ❤️ pic.twitter.com/5efpfLnsjT
— Bharat Boxoffice (@BharatBoxoffic_) August 31, 2024
ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' చేస్తున్నాడు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీలో కాంబోలో ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ఇక ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.
Also Read: Devara Third Single: దేవర థర్డ్ సింగిల్ అప్డేట్ ... అదిరిపోనున్న మాస్ డ్యూయెట్ - Rtvlive.com