DEVARA: న్యూ ఇయర్ స్పెషల్.. 'దేవర' నుంచి సాలిడ్ అప్ డేట్ ఇచ్చిన తారక్

అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సాలిడ్ అప్ డేట్ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో తాను నటిస్తున్న తాజా చిత్రం 'దేవర' సినిమా నుంచి జనవరి 8న గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపాడు. పోస్ట్ వైరల్ అవుతోంది.

DEVARA: న్యూ ఇయర్ స్పెషల్.. 'దేవర' నుంచి సాలిడ్ అప్ డేట్ ఇచ్చిన తారక్
New Update

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నూతన సంవత్సరం సందర్భంగా అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సోమవారం ఉదయం అభిమానులకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుతూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడు. కొరటాల శివ దర్శకత్వంలో తాను నటిస్తున్న అప్ కమింగ్ మూవీ 'దేవర' పోస్టర్ పోస్ట్ చేసిన తారక్ మూవీనుంచి గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు.

ఈ మేరకు 'అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు! మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరి 8వ తేదీన #దేవర నుంచి రాబోతున్న గ్లింప్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అంటూ ట్వీట్టర్ వేదికగా రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్టర్ లో బ్లాక్ డ్రెస్ లో టక్ వేసుకొని పడవలో నిలబడిన తారక్.. సముద్రంలోంచి వస్తున్నట్టు కనిపించే స్టిట్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

publive-image

ఇది కూడా చదవండి : Roshan Kanakala: నన్ను కర్రోడా అంటూ ఎగతాళి చేశారు.. గుక్క పెట్టి ఏడ్చిన సుమ కొడుకు

ఇదిలావుంటే.. ఈ మూవీతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుండగా ఇప్పటికే రిలీజ్ చేసిన పల్లెటూరి పిల్ల లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక దేవర సినిమాని రెండు పార్టులుగా ప్రకటిచగా మొదటి పార్ట్ ని 5 ఏప్రిల్ 2024లో రిలీజ్ చేస్తామని తెలిపారు. ఈ మూవీని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు.

#devara #special-update #ntr
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి