Devara Trailer: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. రెండు రోజుల్లో 'దేవర' ట్రైలర్..!

వినాయకచవితి సందర్భంగా ఎన్టీఆర్ 'దేవర' నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. దేవర ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 10న ట్రైల‌ర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

Devara Trailer: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. రెండు రోజుల్లో 'దేవర' ట్రైలర్..!
New Update

Devara Trailer: కొరటాల శివ- జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'దేవర'. పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న 'దేవర' రెండు భాగాలుగా రానుంది. 'దేవర పార్ట్ 1' సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే మూవీ సాంగ్స్ విడుదల చేయగా.. సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. యూట్యూబ్ లో మిలియన్లకు పైగా వ్యూస్ తో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి.

ట్రైలర్ అప్డేట్ 

అయితే నేడు వినాయక చవితి సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 'దేవర' ట్రైలర్ డేట్ అనౌన్స్ చేశారు. మరో రెండు రోజుల్లో సెప్టెంబర్ 10న ట్రైల‌ర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో తారక్ బ్లాక్ అండ్ బ్లాక్ లో చేతిలో ఆయుధం పట్టుకొని సీరియస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ లుక్ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ లో ఉంది.

యువసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ బ్యానర్స్ పై సుధాకర్ మిక్కిలనేని, కొసరాజు హరికృష్ణ , నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కథానాయికగా నటించగా.. సైఫ్ అలీ ఖాన్, శ్రుతి మరాఠే, ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో, మురళీ శర్మ, అజయ్, అభిమన్యు సింగ్, శ్రీకాంత్, కలైయరసన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: SD18: సాయి ధరమ్ తేజ్ 'SD18' అప్డేట్.. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ ఫస్ట్ లుక్ - Rtvlive.com

#devara-trailer #devara #ntr
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe