RBI Created a Special Coin with NTR Image : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి నందమూరి తారక రామారావు అంటే తెలియని వారు ఉండరు. ఆయన గొప్ప నటుడిగానే కాదు..గొప్ప రాజకీయ నాయకుడిగానూ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన సీనియర్ ఎన్టీఆర్ (Senior NTR) శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆర్బీఐ ప్రత్యేక నాణెం (RBI Special Coin) రూపొందించింది. రూ.100 నాణాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సూచనలతో అందుబాటులోకి తీసుకుని వస్తున్నట్లు ఆర్బీఐ వివరించింది.
ఈ నాణేన్ని ఈ నెల 28 వ తేదీన అధికారికంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi murmu) చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే దీని గురించి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరికీ సమాచారం అందించడం జరిగిది.
పురంధేశ్వరి స్వయంగా వ్యక్తిగతంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ఆహ్వానాలు పంపించారు. నందమూరి తారక రామారావు మే 28 వ తేదీన నిమ్మకూరు లో జన్మించారు. ఈ ఏడాదితో ఆయన పుట్టి వందేళ్లు కావడంతో వచ్చే ఏడాది మే 28 వరకు కూడా శత జయంతి ఉత్సవాలు జరపాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
బాలకృష్ణ ఆధ్వర్యంలో, ఆయన చేతుల మీదుగా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలకు నందమూరి అభిమానులు, తెలుగు ప్రజలు భారీగా హాజరు కాబోతున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.
Also Read: AP రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ లు ఉత్సవ విగ్రహాలుగా మారారు!