Electricity Bills: గుడ్‌న్యూస్.. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించే అవకాశం

ఇటీవల ఫోన్‌ పే, గూగుల్ పే, అమెజాన్ పే, పేటీఎం ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించడాన్ని టీజీ ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌ విద్యుత్తు సంస్థలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా కరెంట్ బిల్లులు ఈ థర్డ్‌ పార్టీ యాప్‌ల ద్వారా చెల్లించే అవకాశాన్ని మళ్లీ పునరుద్ధరించాయి.

New Update
Electricity Bills: గుడ్‌న్యూస్.. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించే అవకాశం

కరెంటు బిల్లులను ఫోన్‌ పే, గూగుల్ పే, అమెజాన్ పే, పేటీఎం ద్వారా చెల్లించే అవకాశాన్ని మళ్లీ పునరుద్ధరించారు. ఈ యాప్‌లు థర్డ్ పార్టీ ఏజెన్సీలు కావడం వల్ల ఆర్బీఐ ఆదేశాల ప్రకారం జలై 1నుంచి ఫోన్ పే, గూగుల్ పే లాంటి యాప్‌ల ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించడాన్ని రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ థర్డ్ పార్టీ యాప్‌లు ఇప్పుడు భారత్ బిల్‌పే లిమిటెడ్‌లో చేరాయి. దీంతో టీజీ ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌ వినియోగదారులు ఇక నుంచి ఫోన్‌పే, గూగుల్ పే, అమెజాన్ పే, పేటీఎం ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించవచ్చు.

Also read: ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులకు అలెర్ట్‌.. మరో కీలక అప్‌డేట్

తెలంగాణలో పాటు ఏపీ విద్యుత్తు సంస్థల వినియోగదారులు సైతం ఈ థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించవచ్చని ఎన్‌పీసీఐ భారత్‌ బిల్‌పే లిమిటెడ్ సీఈవో నూపూర్ చతుర్వేది పేర్కొన్నారు.

Also Read: కాంగ్రెస్‌ శ్రేణులకు మళ్లీ నిరాశ.. కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే !

Advertisment
Advertisment
తాజా కథనాలు