లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS)కు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చింది. ఈ స్కీమ్ కింద 75 శాతం దరఖాస్తుదారుల్లో పూర్తి వివరాలు లేవని రాష్ట్ర సర్కార్ గుర్తించింది. ఇందుకోసం అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసేందుకు దరఖాస్తుదారులకు మరోసారి అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. వెంటనే ఆ వివరాలను జతచేసి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ శుక్రవారం జారీ చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. LRS దరఖాస్తు పరిశీలనను ఈ ఏడాది జనవరిలో రేవంత్ సర్కార్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. పర్మిషన్ లేని, చట్ట విరుద్ధమైన లే అవుట్లను రెగ్యులరైజ్ చేసేందుకు గైడ్లైన్స్ జారీ చేసింది.
పూర్తిగా చదవండి..Telangana: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు అలెర్ట్.. మరో కీలక అప్డేట్
లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS) కింద 75 శాతం దరఖాస్తుదారుల్లో పూర్తి వివరాలు లేవని రేవంత్ సర్కార్ గుర్తించింది. ఈ నేపథ్యంలో అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసేందుకు దరఖాస్తుదారులకు మరోసారి అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది.
Translate this News: