JOBS: ESICలో 1,930 ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు! యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు మరో తీపి కబురు అందించింది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన 'ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్'లో ఉన్న 1,930 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మార్చి 27 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ. By srinivas 09 Mar 2024 in జాబ్స్ నేషనల్ New Update షేర్ చేయండి ESIC: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు మరో తీపి కబురు అందించింది. పర్మినెంట్ ప్రాతిపదికన నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన 'ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్'లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం ఖాళీలు: ఈ నోటిఫికేషన్ ద్వారా 1,930 ఉద్యోగాలను భర్తీ చేయనుండగా యూఆర్-892, ఈడబ్ల్యూఎస్- 193, ఓబీసీ- 446, ఎస్సీ-235, ఎస్టీ- 164, దివ్యాంగులకు-168 కేటాయించారు. అర్హతలు: బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్/ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్. స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సు లేదా నర్సు, మిడ్‌వైఫ్‌గా రిజిస్టరై ఉన్నవాళ్లకే ప్రిపరెన్స్ ఉంటుంది. అలాగే డిప్లొమా (జనరల్ నర్సింగ్ మిడ్-వైఫరీ) అర్హత ఉండాలి. యాభై పడకల ఆసుపత్రిలో పనిచేసిన అనుభవం తప్పనిసరి. ఇది కూడా చదవండి: JOBS: పది అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేలకు పైగా వేతనం! వయో పరిమితి: 2024 మార్చి 27 నాటికి అన్‌రిజర్వ్‌డ్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 30 ఏళ్లు, ఓబీసీలకు 33, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 35, దివ్యాంగులు 40ఏళ్లకు మించరాదు. దరఖాస్తు ఫీజు: రూ.25. మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ: 2024 మార్చి 27 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ దరఖాస్తు సవరణ: 2024 మార్చి నుంచి 2024 ఏప్రిల్ 3 వరకు తప్పులు సరిదిద్దుకోవాలి. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్ష కేంద్రాలు: అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్. రిక్రూట్‌మెంట్ టెస్ట్ తేదీ: 2024 జూలై 7 మరిన్ని వివరాలకు ఈ వెబ్‌సైట్ ను సంప్రదించండి: https://upsc.gov.in/ #notification-release #esic #1 #930-jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి