Govt jobs 2023: నిరుద్యోగులకు శుభవార్త.. మరో 496 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఏఏఐ కార్యాలయాల్లో 496 జూనియర్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదలైంది. బీఎస్సీ (ఫిజిక్స్‌/ మ్యాథ్స్‌) లేదా ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నవంబర్‌ 30లోగా దరఖాస్తులు చేసుకోవాలి. 30.11.2023 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.

New Update
Jobs: ఆంధ్ర నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..విశాఖ, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు

న్యూఢిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో 496 జూనియర్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్సీ (ఫిజిక్స్‌/ మ్యాథ్స్‌) లేదా ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నవంబర్‌ 30లోగా దరఖాస్తులు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 1న ప్రారంభమవుతుంది. వాయిస్‌ టెస్ట్‌, సైకోయాక్టివ్‌ సబ్‌స్టాన్స్‌ టెస్ట్‌.. అలాగే మెడికల్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మొత్తం ఖాళీలు: 496

అర్హత ప్రమాణం: ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌తో సైన్స్‌లో మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ (బీఎస్‌సీ) లేదా ఏదైనా విభాగంలో ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. (ఫిజిక్స్ & మ్యాథమెటిక్స్ ఏదైనా ఒక సెమిస్టర్ పాఠ్యాంశాల్లో సబ్జెక్టులుగా ఉండాలి).

వయోపరిమితి: 30.11.2023 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.

ఎంపిక ప్రక్రియ: ఎంపిక ప్రక్రియలో ఆబ్జెక్టివ్ టైప్ ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష తర్వాత అప్లికేషన్ వెరిఫికేషన్/ వాయిస్ టెస్ట్/ సైకోయాక్టివ్ సబ్‌స్టాన్సెస్ టెస్ట్/ సైకలాజికల్ అసెస్‌మెంట్ టెస్ట్/ మెడికల్ టెస్ట్/ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్, పోస్ట్ లేదా మరేదైనా పరీక్షకు వర్తించే విధంగా, ఏ దశలోనైనా సమర్థ అధికారం ద్వారా నిర్ణయించబడుతుంది.

దరఖాస్తు రుసుము: దరఖాస్తు రుసుము రూ. 1000/-. అయితే, ఏఏఐ/ మహిళా అభ్యర్థుల్లో విజయవంతంగా ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ పూర్తి చేసిన SC/ST/PWD అభ్యర్థులు/ అప్రెంటీస్‌లకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు AAI అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయవచ్చు.

నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఏఏఐ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లేందుకు ఇక్కడ క్లిక్ చేయడి.

Also Read: ఐటీ ఉద్యోగులకు షాక్.. గంటకు 23 మంది ఔట్..!!

Advertisment
తాజా కథనాలు