Jobs: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (National Thermal Power Corporation)నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలో పనిచేసే ఈ సంస్థ తాజాగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్(Assistant Executive) పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఎన్టీపీసీ దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ రాష్ట్రాల ఎలక్ట్రిక్ బోర్డులకు సరఫరా చేస్తుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్ పోర్టల్ careers.ntpc.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రాసెస్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. ఈ గడువు ఫిబ్రవరి 8వ తేదీతో ముగియనుంది. రిక్రూట్ మెంట్ కు సంబంధించి అర్హతలు, ఎంపిక ప్రక్రియ వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఖాళీలు:
ఈ రిక్రూట్ మెంట్ ద్వారా ఎన్టీపీసీ మొత్తం 223 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తుంది. జనరల్ కేటగిరి నుంచి 98 పోస్టులు, ఈ డబ్ల్యూఎస్ కేటగిరీ నుంచి 22, ఓబీసీ 40, ఎస్సీ 39, ఎస్టీ 24 పోస్టుల భర్తీ చేయనుంది.
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2024 ఫిబ్రవరి 8 నాటికి వయస్సు 35ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయస్సుకు సంబంధించి సడలింపు ఉంటుంది.
అర్హతలు:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి చేయాలి.
దరఖాస్తు ప్రక్రియ:
ఎన్టీపీసీ అధికారిక పోర్టల్ careers.ntpc.co.in ఒపెన్ చేసి అందులోకి వెళ్లాలి. హోం పేజీలోకి వెళ్లి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్ మెంట్ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలను చెక్ చేయాలి. తర్వాత అప్లై ఆప్షన్ సెలక్ట్ చేసి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా మీకు సంబంధించిన వ్యక్తగత వివరాలను ఎంటర్ చేయాలి. రిజిస్టర్ అయిన తర్వాత ఐడీ సాయంతో అప్లికేషన్ ఫారమ్ ను ఓపెన్ చేసి అందులో వివరాలన్నింటిని నమోదు చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేసి చివరిగా దరఖాస్తును సబ్మిట్ చేయాలి.
దరఖాస్తు రుసుము:
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు.
జీతం:
ఎన్టీపీసీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్ మెంట్ ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు జీతం రూ. 55వేలు లభిస్తుంది. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
ఇది కూడా చదవండి: ఎడాపెడా డబ్బు ఖర్చు చేస్తున్నారా? ఈ విషయం తెలుసుకుంటే పొదుపు చేయడం పక్కా..!!