AP Government Jobs: ఏపీలో 434 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి! నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఏపీ సర్కార్. కొత్తగా ఏర్పడిన మెడికల్ కాలేజీల్లో కాంట్రాక్ట్ పద్దతిలో 434 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను చూద్దాం. By Bhoomi 24 Sep 2023 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఏపీలో కొత్తగా ఏర్పాటైన 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కాంట్రాక్ట్ విధానంలో 434 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రజారోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 68 పోస్టులను వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిల్లో భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను అకాడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సెలక్ట్ చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా అక్టోబర్ 5వ తేదీ వరకు చివరి తేదీ ఉంది. పోస్టుల చూస్తే.. జోనల్ వారీగా ఖాళీలు జోన్ I- 86, జోన్ II- 220, జోన్ III- 34, జోన్ IV - 94 పోస్టులు అర్హతలు: జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) లేదా బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణులవ్వాలి. వయోపరిమితి: 42 సంవత్సరాలు మించరాదు ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, బీసీ అభ్యర్థులకు రూ.300 గా నిర్ణయించారు.. దరఖాస్తు విధానం: మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ప్రాంతీయ డైరెక్టర్ కార్యాలయంలో ఆఫ్‌లైన్ దరఖాస్తులను అందజేయాలి. దరఖాస్తులు ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 21, 2023 దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 5, 2023 పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : https://cfw.ap.nic.in/ కాగా అటు ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టీచర్ పోస్టులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర శాసనమండలిలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ…ఖాళీగా ఉన్న 8వేలకు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈ విషయంలో తాము కట్టుబడి ఉన్నామన్నారు. మెరుగైన విద్యాను రాష్ట్రంల అందిస్తున్నామని బొత్స వెల్లడించారు. ఇది కూడా చదవండి: ల్యాండర్, రోవర్ సంకేతాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోన్న ఇస్రో..!! మరోవైపు తెలంగాణ సర్కార్ 5,089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. డీఎససీ నోటిఫికేషన్ కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎట్టకేలకు టీఆర్టీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అయితే ప్రభుత్వం చాలా తక్కువ సంఖ్యలో పోస్టులు భర్తీ చేస్తుందని పోస్టుల సంఖ్య పెంచాలని అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు టీఆర్టీ దరఖాస్తు ఫీజు కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పటికే టీఆర్టీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. తాజాగా తెలంగాణ టీఆర్టీ పరీక్ష తేదీలను కూడా ప్రకటించింది. కాగా తెలంగాణ గురుకుల ఉద్యోగాలకు భర్తీకి సంబంధించి TREIPB నుంచి కీలక ప్రకటన వెలువడింది. పరీక్షకు హాజరైన అభ్యర్థఉలు సొసైటీ, జోనల్ వారీగా ఆప్షన్లు ఇవ్వాలని కోరింది. అభ్యర్థులు అన్ని సొసైటీలకు ఆప్షన్లు ఇస్తేనే పోస్టుల పోటీలో బలంగా నిలబడేందుకు అవకాశాలు ఉంటాయని, మెరిట్ ప్రాతిపదికన పోస్టులు దుక్కేందుకు చాన్స్ ఉంటుందని బోర్డు వెల్లడించింది. ఇది కూడా చదవండి: అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్.. ఆఫర్లే ఆఫర్లు.. అదిరే డిస్కౌంట్లు..!! #latest-jobs #jobs-update #ap-government-jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి