Telangana: మహిళా కమిషన్ సభ్యులకు నోటీసులు.. ఎందుకంటే ?

మహిళా కమిషన్ ముందు హాజరైన మాజీ మంత్రి కేటీఆర్‌కు మహిళలు రాఖీ కట్టడంపై కమిషన్ ఛైర్మన్ నేరేళ్ల శారద సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆరుగురు మహిళా కమిషన్ సభ్యులకు నోటీసులు జారీ చేయాలని ప్యానెల్ సెక్రటరీకి ఆదేశించారు.

Telangana: మహిళా కమిషన్ సభ్యులకు నోటీసులు.. ఎందుకంటే ?
New Update

ఆరుగురు మహిళా కమిషన్ సభ్యులకు నోటీసులు జారీ చేయాలని ప్యానెల్ సెక్రటరీకి కమిషన్ ఛైర్మన్‌ నేరేళ్ల శారద ఆదేశించారు. విచారణకు హాజరైన మాజీ మంత్రి కేటీఆర్‌కు కమిషన్‌ కార్యాలయంలో రాఖీ కట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అక్కడి ప్రాంగణంలో మొబైల్ ఫోన్స్‌కు పర్మిషన్ లేకపోయినా కూడా సీక్రెట్‌గా మొబైల్ ఫోన్‌ తీసుకెళ్లి రాఖీ కట్టిన వీడియోలు చిత్రీకరించడంపై సీరియస్ అయ్యారు. కమిషన్ విశ్వసనీయతను దెబ్బతిసేలా ప్రవర్తించారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లీగర్ అభిప్రాయలు తీసుకున్న తర్వాత ఆరుగురు సభ్యులపై కమిషన్ చర్యలు తీసుకోనుంది.

Also read: రోడ్డు దాటుతుండగా ప్రాణాలు తీసిన అతివేగం.. వీడియో వైరల్

ఇదిలాఉండగా.. మహిళా కమిషన్‌ ముందు విచారణకు హాజరైన తర్వాత కేటీఆర్ మట్లాడారు. తాను చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పటికే విచారం వ్యక్తం చేశానని తెలిపారు. కాంగ్రెస్ నేతలు కమిషన్ కార్యాలయం వద్దకు వచ్చి రాజకీయం చేశారని.. బీఆర్‌ఎస్ మహిళా నేతలపై దాడులు చేశారంటూ ఆరోపించారు. కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిపై తాను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. మహిళలను గౌరవించాలని తాను విచారణకు వచ్చానని చెప్పారు. రాష్ట్రంలో సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని.. మహిళలపై జరుగుతున్న దాడులు, హాస్టల్స్‌ పిల్లప సమస్యలపై ప్రస్తావించినట్లు కేటీఆర్‌ వెల్లడించారు.

Also Read: ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగాయో చెప్పండి.. తేల్చేద్దాం: పొన్నం

#ktr #telugu-news #women-commission
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe