కస్టమర్లకు విజ్ఙప్తి.. దయచేసి టమాటా కర్రీ అడగకండి

టమాటా పేరు వింటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. కొన్నాలంటేనే జంకుతున్నారు. రోజురోజుకు టమాటా ధరలు ఆకాశాన్నింటడడంతో వణికిపోతున్నారు. వంటల్లో వాడాలంటేనే సతమతమవుతున్నారు. కొన్ని చోట్ల అయితే టమాటా వాడకం వల్ల కాపురాలు కూడా కూలిపోతున్నాయి. అంతలా టమాటా ధరలు సామాన్యులపై ప్రభావం చూపిస్తున్నాయి.

New Update
కస్టమర్లకు విజ్ఙప్తి.. దయచేసి టమాటా కర్రీ అడగకండి

Notice to customers.. Please dont ask for tomato curry

 'కంటతడి' పెట్టిస్తున్న టమాటా..

టమాటా లేని వంటకం ఉంటుందంటే నమ్ముతారా? నమ్మరు కదా? ఏ వంటకంలో అయినా టమాటా ఉండాల్సిందే. టమాటా ముక్కలు ఉంటేనే ఆ వంటకానికి రుచి. అలాంటిది కొన్ని రోజుల నుంచి టమాటా ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో కొనాలంటేనే జనాలు వణికిపోతున్నారు. ప్రస్తుతం కిలో టమాటా ధర రూ.150 నుంచి రూ.200 వరకు పలుకుతుంది. దీంతో సామాన్యులు వీటిని కొనలేక అవస్థలు పడుతున్నారు. మరికొన్ని చోట్ల దాబాలు, హోటల్స్ అయితే వంటకాల్లో టమాటాలను అందించడం లేదు.

ముఖ్య గమనిక.. టమాటా కర్రీ లేదు..

పలు హాటల్స్‌ల్లో అయితే టమాటా కర్రీ అడగవద్దు అంటూ బోర్డులు పెడుతున్నారంటే సమస్య ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉప్పు లేని పప్పు ఎంత దారుణంగా ఉంటుందో టమాటా లేని కర్రీ కూడా అంతే వరస్ట్‌గా ఉంటుంది. కానీ ఏం చేస్తాం టమాటా ధరలు విపరీతంగా పెరగడంతో హోటల్, కర్రీ పాయింట్స్ నిర్వాహకులు వాటి వినియోగం తగ్గించేశారు. సాంబార్, రసం, పప్పులో టమాటా వాడటం లేదు. దాంతో కస్టమర్లు, నిర్వాహకులు మధ్య టమాటా విషయంలో ఘర్షణలు కూడా జరుగుతున్నాయి.

ఇటు కస్టమర్ల నిలదీతలు..అటు టమాటా ధరలు..

ముఖ్య గమనిక.. మా హోటల్‌లో టమాటా కర్రీ అందుబాటులో లేదు.. దయచేసి టమాటా కర్రీ అడగవొద్దు అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. హైవేల వెంట దాబాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఎందుకంటే లారీ డ్రైవర్లు, ఇతర ప్రయాణికులు వాహనాలు పక్కన ఆపి అక్కడ తింటుంటారు. అందులోనూ ఉత్తరాదికి చెందిన వారికి టమాటా కచ్చితంగా ఉండాల్సిందే. అందుకే నిర్వాహకులు ఇలా బోర్డులు పెట్టేస్తున్నారు. అయితే కూరల్లో టమాటాలు లేక రుచిగా లేకపోవడంతో కస్టమర్లు నిలదీస్తున్నారు. దీంతో ఇటు కస్టమర్ల నిలదీతలు.. అటు టమాటా ధరలతో వారి పరిస్థితి ముందునొయ్యి, వెనకగొయ్యి చందంగా తయారైంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు