Fearless Animal:సింహాలు, ఏనుగులే కాదు.. ఈ భూమ్మీద భయం లేని జంతువు ఇదే!

పులులు, సింహాలు వంటి మాంసాహారులు అడవిలో అత్యంత ప్రమాదకరమైన, భయం లేని జంతువులుగా గుర్తింపు పొందాయి. కానీ ఏమాత్రం భయం లేని, అడవిలో అత్యంత ధైర్యం ఉన్న జంతువు మరొకటి ఉంది. అదే హనీ బ్యాడ్జర్.దాని గురించి తెలుసుకోండి!

New Update
Fearless Animal:సింహాలు, ఏనుగులే కాదు.. ఈ భూమ్మీద భయం లేని జంతువు ఇదే!

భూమిపై ఎన్నో రకాల జీవులు నివసిస్తాయి. మనుషులతో పాటు విభిన్న రకాల జంతువులు, పశుపక్ష్యాదులకు భూగ్రహం నిలయంగా ఉంది. అయితే ఎక్కువ జీవజాతులు అడవుల్లోనే ఉంటాయి. అభయారణ్యాల్లో ఉండే అన్ని ప్రాణులు జీవ వైవిధ్యాన్ని కాపాడతాయి. అయితే పులులు(Tigers), సింహాలు(Lions) వంటి మాంసాహారులు అడవిలో అత్యంత ప్రమాదకరమైన, భయం లేని జంతువులుగా గుర్తింపు పొందాయి. కానీ ఏమాత్రం భయం లేని, అడవిలో అత్యంత ధైర్యం ఉన్న జంతువు మరొకటి ఉంది. అదే హనీ బ్యాడ్జర్(Honey Badger). ఈ జంతువులు సింహాలను సైతం భయపెట్టగలవు.

హనీ బ్యాడ్జర్ చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది. కానీ తెలివి, ధైర్యం విషయంలో దీన్ని మించిన జంతువు ఈ భూమిపై మరొకటి లేదు. ఈ ప్రెడేటర్ దూకుడుకు మారుపేరు. హనీ బ్యాడ్జర్ ‘ప్రపంచంలోని మోస్ట్ ఫియర్‌లెస్ యానిమల్‌’గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. పులులు, సింహాలు, హైనాలు వంటి పెద్ద, వేటాడే జంతువులను కూడా ఇవి ఎదుర్కోగలవు.హనీ బ్యాడ్జర్స్ చాలా క్రూరమైనవి, తెలివైనవి. పదునైన దంతాలు, గోర్లతో ఇతర జంతువులపై భయంకరంగా దాడి చేస్తాయి. అద్భుతమైన రక్షణ నైపుణ్యాలు ఉన్నప్పటికీ, ఇవి అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉన్నాయి. మన దేశంలో, జీవవైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ టైగర్ రిజర్వ్‌లో హనీ బాడ్జర్స్ తరచుగా కనిపిస్తుంటాయి.

ఇవి ఆఫ్రికా, సౌదీ అరేబియా, ఇరాన్‌తో పాటు పశ్చిమ ఆసియా దేశాల్లో నివసిస్తాయి. సౌత్ ఆఫ్రికన్ కంట్రీ లైఫ్ రిపోర్ట్ ప్రకారం.. హనీ బ్యాడ్జర్ల శరీర నిర్మాణం ఇతర జంతువుల దాడి నుంచి రక్షణ పొందేలా ఉంటుంది. పదునైన పంజాలు, దట్టమైన చర్మంతో పాటు చాలా బలమైన దవడలు వీటి సొంతం. అందుకే ఇవి ఏమాత్రం భయపడకుండా తమపైకి దూసుకొచ్చే పెద్ద జంతువులపై తిరిగి దాడి చేస్తాయి. వాటిని భయపెట్టి, తమను తాము రక్షించుకుంటాయి.

Advertisment
తాజా కథనాలు