/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/kharge-jpg.webp)
దేశ రాజధాని నగరంలో ఎంతో అట్టహాసంగా జీ 20 సమావేశాలు ప్రారంభం అయ్యాయి. జీ 20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు దేశంలోని అన్ని పార్టీల నేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ముఖ్య నేతలకు , అధ్యక్షులకు ఆహ్వానాలు వెళ్లాయి.
ఈ క్రమంలో మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్‌డీ దేవగౌడలకు కూడా రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వాన పత్రికలు వెళ్లాయి. దేశ వ్యాప్తంగా ఉన్న నాయకులందరికీ ఆహ్వానాలు అందించిన రాష్ట్రపతి భవన్..కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు మాత్రం ఇప్పటి వరకూ ఆహ్వానం అందలేదు. దీని గురించి కాంగ్రెస్ తో పాటు మరికొన్ని విపక్షాలు కూడా మండిపడుతున్నాయి.
ఇప్పటికే ఈ అంశం గురించి మాజీ మంత్రి చిదంబరం కూడా మాట్లాడారు. కేంద్రం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యం, ప్రతిపక్షాలు ఉనికిని కోల్పోయే దశకు భారత్ చేరుకోలేదని తాను ఆశిస్తున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. కేవలం ప్రజాస్వామ్యం, ప్రతిపక్షాలు లేని సమాజంలో మాత్రమే ఇలాంటివి జరుగుతాయని ఆయన మండిపడ్డారు.
దేశంలో సుమారు 60 శాతం మందికి ప్రతిపక్ష నేతగా ఉన్న ఖర్గేకు ఆహ్వానం అందకపోవడం గురించి ఆయన తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా దీని గురించి ఖర్గే కూడా స్పందించారు. దేశంలో ఎంతో అత్యున్నత సమావేశాలు జరుగుతున్న సమయంలో రాజకీయాలు చేయకూడదని అన్నారు.
దీని గురించి ఖర్గే మాట్లాడుతూ...'' నేను ఇప్పటికే దీని పై స్పందించాను. మా పార్టీ స్పందించింది. ఇలా చేయడం మంచి పద్దతి కాదు. బీజేపీ వారు ఇలాంటి నీచ రాజకీయాలు చేయకూడదు'' అని పేర్కొన్నారు. ఈ విందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం వెళ్లింది.
బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో పాటు ఇండియా కూటమిలో ఉన్న తమిళనాడు సీఎం స్టాలిన్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లకు ఆహ్వానం అందించింది. వీరిలో కొందరు నేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.
అయితే మాజీ ప్రధాని దేవగౌడకు ఆహ్వానం పంపినప్పటికీ ఆయన ఈ విందుకు దూరంగా ఉంటున్నారు. ఆరోగ్య పరిస్థితులు సహకరించకపోవడం వల్ల విందుకు హాజరుకావడం లేదని ఆయనే ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
Kalaburagi, Karnataka | On not being invited to attend the G-20 Dinner in Delhi today, Congress president Mallikarjun Kharge says "I have already reacted to it. Our party has reacted to this. It is not good politics, and they (Centre) should not do such low-level politics." pic.twitter.com/mICFouRBCq
— ANI (@ANI) September 9, 2023