USA : కమలా హారిసే గెలుస్తారు‌‌ – నోస్ట్రాడమస్ అలెన్ లిచ్ట్‌మన్ జోస్యం

ఈసారి ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిసే గెలుస్తారని జోస్యం చెప్పారు అలెన్ లిచ్ట్‌మన్. 13 కీస్ టుది వైట్ హౌస్ పద్ధతి ప్రకారం కమలాకు 8కీస్ వచ్చాయని..అందుకే ఆమెనే తదుపరి అధ్యక్షురాలని అలెన్ చెప్పారు. యుఎస్ ప్రెసిడెంట్ పోల్స్ నోస్ట్రాడమస్ గా అలెన్ పేరు పొందారు.

Kamala Harris: 85 నిమిషాల పాటు దేశాధ్య‌క్షురాలిగా కమలా హ్యారిస్‌!
New Update

US President Elections : నవంబర్ 5 అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్, డెమోక్కటిక్ పార్టీ నుంచి కమలా హారిస్ (Kamala Harris) అయక్ష రేసులో ఉన్నారు. డెమోక్రటిక్ అధ్యక్ష పదవి రేసు నుంచి జో బైడెన్ (Joe Biden) తప్పుకోవడంతో కమలా ముందుకు వచ్చారు. దీంతో ఇరు పార్టీల మధ్యా గట్టి పోటీ నెలకొంది. ఇరు నేతలూ దానికి తగ్గట్టే ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. కొన్ని చోట్ల ట్రంప్‌కు ఎక్కువ బలం ఉంటే మరికొన్ని చోట్ల కమలా హారిస్‌కు బలం ఉండి సమవుజ్జీలుగా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో యుఎస్ ప్రెసిడెంట్ పోల్స్ నోస్ట్రాడమస్ అని పిలుచుకునే అలెన్ లిచ్ట్‌మన్ (Alan Richman) తరువాతి అమెరికా అధ్యక్షులు ఎవరన్నది జోస్యం చెప్పేశారు. 2016లో, 2020లో ఇతను చెప్పిన జోస్యం అక్షరాలా నిజమైంది. అందుకే ఇతనికి నోస్ట్రాడమస్ అని పేరు వచ్చింది.

50 ఏళ్ళుగా అమెరికన్ యూనివర్శిటీలో హిస్టరీ ప్రొఫెసర్‌‌గా పని చేస్తున్న అలెన్ 40ఏళ్ళకు పైగా అధ్యక్ష ఫలితాలను అంచనా వేస్తూనే ఉన్నారు. ఈయన లెక్కలు ఎప్పుడూ తప్పలేదు. కీస్ టుది వైట్ హౌస్ అని తాను కనిపెట్టిన పద్ధతి ప్రకారం ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తారు అలెన్. ఈ సారి కూడా ఇదే పద్ధతిని అనుసరించి వేసిన లెక్కల్లో కమలా హారిస్‌దే పై చేయి అని అలెన్ తేల్చి చెప్పారు. 13 పాయింట్లలలో కమలాకు 8 పాయిట్లు వచ్చాయని కాబట్టి ఆమె తదుపరి అమెరికా అధ్యక్షురాలు అని తేల్చి చెప్పారు. న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యలో ఈ ఫలితాలను వివరించారు అలెన్. కమలా హారిస్‌కు అనుకూలంగా 8కీలు ఉంటే... ట్రంప్‌ (Trump) కు వ్యతిరేకంగా 5 కీలు ఉన్నాయని ఆయన తెలిపారు. దీని ప్రకారం అతను వైట్ హౌస్‌ను తిరిగి పొందలేడని తేల్చారు.

Also Read: Andhra Pradesh: విజయవాడలో ఇన్యూరెన్స్ కోసం వరద బాధితుల క్యూ

#alan-richman #us-president-elections #donald-trump #kamala-harris
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe