Nora Fatehi: దానికోసమే హీరోయిన్లు పెళ్లి చేసుకుంటారు.. నటి షాకింగ్ కామెంట్స్!

బోల్డ్ బ్యూటీ నోరా ఫతేహి నటీనటుల పెళ్లిళ్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. కొంతమంది బాలీవుడ్ నటులు కేవలం తమ పలుకుబడి కోసమే పెళ్లిళ్లు చేసుకుంటారని చెప్పింది. చాలామంది కపుల్స్ మధ్య ప్రేమానుబంధాలు ఉండవని, డబ్బుమీద తపనతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారంటోంది.

New Update
Nora Fatehi: దానికోసమే హీరోయిన్లు పెళ్లి చేసుకుంటారు.. నటి షాకింగ్ కామెంట్స్!

Bollywood: బోల్డ్ బ్యూటీ నోరా ఫతేహి సినీ పరిశ్రమలో నటీనటుల పెళ్లిళ్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. కొంతమంది బాలీవుడ్ నటుడు కేవలం తమ పలుకుబడి కోసమే పెళ్లిళ్లు చేసుకుంటారని చెప్పింది. చాలామంది కపుల్స్ మధ్య ప్రేమానుబంధాలు ఉండవని, తమ కెరీర్‌లో ముందుకెళ్లాలనే తపనతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారంటోంది. అంతేకాదు ఇండస్ట్రీలో తాను స్వయంగా చాలామందిని చూశానంటూ ఆసక్తకిక విషయాలు బయటపెట్టింది.

తొందరపడి తర్వాత బాధపడి..
ఈ మేరకు 'ఇండస్ట్రీలో కొంతమంది నటీనటులు భార్యలు లేదా భర్తలను తమ సర్కిల్స్‌లో డబ్బు, పరపతి కోసం నెట్‌వర్క్‌ పెంచుకునేందుకు వాడుకుంటారు. ప్రేమ లేని చోట బలవంతంగా క్రియేట్ చేసుకుని జీవితాన్ని నెట్టుకొస్తారు. డబ్బుమీద ఆశతో ఆవేశపడి పెళ్లిళ్లు చేసుకుని తర్వాత నరకం అనుభవిస్తారు. నాకు తెలిసిన చాలామంది డబ్బు, పరపతిమీద దురాశతో తొందరపడి తర్వాత బాధపడ్డట్లు చెప్పారు' అని నోరా ఓ సమావేశంలో చెప్పుకొచ్చింది.

ఇదిలావుంటే నోరా ప్రస్తుతం కరుణకుమార్ దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ మట్కా (Matka)లో లీడ్ రోల్‌లో నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో పీరియాడిక్ బ్యాక్‌ డ్రాప్ స్టోరీతో రాబోతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.

Advertisment
తాజా కథనాలు