Varun-Lavanya Marriage:పెళ్ళి వీడియో అమ్ముకోలేదు..క్లారిటీ ఇచ్చిన వరుణ్ టీమ్

ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ లో ఒక్కటయ్యారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అలాగే వీరి పెళ్ళి వీడియోను కూడా నెట్ ఫ్లిక్స్ కొనుక్కుందని రూమర్స్ వచ్చాయి. తాజాగా అలాంటిదేమీ లేదంటూ వరుణ్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.

Varun-Lavanya Marriage:పెళ్ళి వీడియో అమ్ముకోలేదు..క్లారిటీ ఇచ్చిన వరుణ్ టీమ్
New Update

Varun-Lavanya Marriage Video: మెగా ఇంట్లో పెళ్ళి తెలుగునాట అంతా సందడి చేసింది. ఎక్కడో ఇటలీలో వివాహం జరిగినా..వెంటవెంటనే ఫోటోలు బయటకు రావడంతో అందరూ వాటిని చూసి ఆనందించారు.నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ (Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠిని (Lavanya Tripathi) ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. ఇటలీలో ఈ వివాహం అంగరంగ వైభంగా జరిగింది. దీని మెగా ఫ్యామిలీ అంతా హాజరయ్యింది. తరువాత అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన కొత్త జంట హైదరాబాద్ లో కూడా గ్రాండ్ గా రిసెప్షన్ ఇచ్చింది. దీనికి తెలుగు తారాలోకం అంతా దాదాపు హాజరయ్యింది.

Also Read: మనకు తిరుగులేదు బాస్..ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ ర్యాంకుల్లో భారత ఆటగాళ్ళు

వరుణ్-లావణ్య పెళ్ళి, దానికి ముందు జరిగిన ఫంక్షన్స్ అన్నింటివీ ఫోటోలు ఎప్పటికప్పుడు మెగా ఫ్యామిలీ షేర్ చేస్తూనే ఉంది. ఎక్కడో దూరంగా వివాహం జరిగినా...ఆ ఫీలింగ్ కలగకుండా చేసింది. వరుణ్-లావణ్యల పెళ్ళి ఫోటోలు అయితే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి కూడా. ఈ నేపథ్యంలో వరుణ్-లావణ్యల పెళ్ళి వీడియోను నెట్ ఫ్లిక్స్ కొనుక్కుంది అన్న రూమర్ కూడా బయటకు వచ్చింది. ఏకంగా ఎనిమిది కోట్లు పెట్టి మెగా ఫ్యామిలీ పెళ్ళి వీడియోను నెట్ ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకుందని చెప్పారు కూడా. అయితే అవన్నీ ఒట్టి రూమర్లే అని కొట్టి పారేసింది వరున్ తేజ్ టీమ్. వివాహం వీడియోను ఎవ్వరికీ అమ్మలేదని స్పష్టం చేశారు. అది వాళ్ళిద్దరికీ జీవితాంతం గుర్తుండిపోయే తీపి గుర్తు అని...దాన్ని ఇలా ఓటీటీలకు ఇవ్వరని తెలిపారు.

మరోవైపు తమ పెళ్ళికి సంబంధించి ఒక కొత్త ఫోటోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు వరుణ్ తేజ్. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఈ ఫోటోలో కొత్త జంట ఇద్దరూ బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు.

Also read:ఒకవేళ హంగ్ వస్తే తెలంగాణ లో పరిస్థితి ఏంటి? పార్టీల ప్లాన్ బీ ఎలా ఉంటుంది?

#ott #lavanya-tripathi #varun-tej
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe