Andhra Pradesh : రిటైర్డ్‌ అయ్యే ఉద్యోగుల‌కు నో ట్రాన్స్‌ఫర్స్‌!

ఏపీ ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి 31 లోపు పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులకు ఓ గుడ్‌ న్యూస్ చెప్పింది. బ‌దిలీల నుంచి వారికి మిన‌హాయింపు ఇచ్చింది.దీని కోసం ప్రభుత్వం జీవో నెంబ‌ర్ 76 విడుద‌ల చేసింది. ఈ నిర్ణయం పట్ల పలు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

New Update
Ap Govt: వాలంటీర్ల వ్యవస్థ పై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం!

No Transfers For Retiring Employees In AP : వచ్చే ఏడాది మార్చి 31 లోపు పదవీ విరమణ (Retirement) అయ్యే ఉద్యోగులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం (AP State Government) ఓ శుభవార్త చెప్పింది. వారిని సాధార‌ణ బ‌దిలీల‌ నుండి మిన‌హాయిస్తున్న‌ట్లు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం జీవో నెంబ‌ర్ 76తో కూడిన గెజిట్ ని విడుద‌ల చేసింది. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున రాష్ట్ర ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ పియూష్ కుమార్ దీనిని విడుద‌ల చేశారు.

వ‌చ్చే ఏడాది మార్చిలోపు ప‌ద‌వీ విర‌మ‌ణ చేసే ఉద్యోగులు సుమారు 8 వేల మంది ఉంటార‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. బ‌దిలీల నుండి ఈ ఉద్యోగుల‌ను మినహాయించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్నఈ నిర్ణ‌యంతో చాలా మంది సీనియర్‌ ఉద్యోగుల‌కు ఊరట క‌లుగుతోంది. అలాగే వారి పెన్ష‌న్ల ఫైల్స్ రెడీ చేసుకునేందుకు కూడా అవకాశం ఉంటుందని ఉద్యోగులు పేర్కొంటున్నారు.

ట్రాన్స్ఫర్స్ (Transfers) ప్ర‌క్రియ ఈనెల 31తో ముగుస్తుండ‌టంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందా? అనే ఆందోళ‌న‌లో ఉన్న రిటైర్డ్‌ అవ్వబోయే ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వం తాజాగా తీసుకున్న నిర్ణ‌యంతో భారీ ఊర‌ట ల‌భించింది. సాధార‌ణ బ‌దిలీల నుంచి రిటైర్డ్‌ అయ్యే ఉద్యోగుల‌కు మిన‌హాయింపు ఇవ్వ‌డం ప‌ట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: పడవ బోల్తా..13 మంది మృతి!

Advertisment
తాజా కథనాలు