ప్రధాని మోదీ మాటలు ఎవరు నమ్మరు... మోదీపై వైసీపీ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు

ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎంపీ నందిగం సురేష్. ప్రధాని మోదీ చెప్పడమే కానీ అమలు చేయడంలో విఫలం అయ్యారని సెటైర్లు వేశారు. ఈ సారి ఏపీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు.

ప్రధాని మోదీ మాటలు ఎవరు నమ్మరు... మోదీపై వైసీపీ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు
New Update

MP Nandigam Suresh: తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ (PM Modi) చేసిన ఓ ప్రకటన దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. హైదరాబాద్ నగరంలో మంద కృష్ణ మాదిగ (Manda Krishna Madiga) అధ్యక్షతన జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ (Congress) అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ జాబితాలో ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. బీజేపీ (BJP) ప్రభుత్వం ఏర్పాటు చేశాక బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. త్వరలోనే ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

ALSO READ: రుణమాఫీపై కీలక అప్డేట్.. చదవండి!

ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేస్తామన్న మోదీ ప్రకటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఏపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ (Nandigam Suresh) మోదీపై చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపే నల్లధనాన్ని తీసుకొస్తానని చెప్పిన నరేంద్ర మోదీ.. ఎస్సీ వర్గీకరణ చేస్తారంటే ఎవరు నమ్మరని సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ నందిగం సురేష్. సామాజిక సాధికార బస్సు యాత్ర ద్వారా ప్రజల్లో వైసీపీకి ఎలాంటి మద్దతు ఉందో మరోసారి రుజువైందని, టీడీపీ జనసేన పైడ్ పార్టీలు అయిపోయాయని ఆయన ఆరోపించారు. మళ్లీ ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఎన్ని పన్నాగాలు పన్నిన ఏపీ ప్రజలు సీఎం జగన్ (CM Jagan) వైపే ఉన్నారని అన్నారు.

ALSO READ: సీఎం కేసీఆర్ కు కోటి రూపాయిల అప్పు ఇచ్చిన నేత.. ఎవరంటే?

మరోవైపు ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు ప్రధాని మోదీ, మంద కృష్ణ మాదిగపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో నరేంద్ర మోడీ భజన చేయడానికి విశ్వరూప సభ పెట్టారని, మాదిగ జాతి ఆత్మ అభిమానాన్నిమోదీ కాళ్ల దగ్గర పెట్టిన మందకృష్ణ మాదిగను మాదిగ జాతి క్షమించదని వెంకటేశ్వరరావు మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ చేసేవాళ్లయితే పార్లమెంట్లో బిల్లు పెడతానని మోదీతో ఎందుకు చెప్పించలేకపోయారని వెంకటేశ్వరావు ప్రశ్నించారు. మందకృష్ణ మాదిగ డబ్బులు అమ్ముడుపోయి మాదిగ జాతిని పార్టీలకు తాకట్టు పెట్టాలని చూస్తున్నారని, ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని 30 ఏళ్లగా బ్రతుకుతున్న మందకృష్ణ మాదిగి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

#ap-news #pm-modi #mp-nandigam-suresh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe