Care Rating Survey : కాసేపట్లో కేంద్రం మధ్యంతర బడ్జెట్(Budget) ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈసారి మధ్యంతర బడ్జెటైనా ఉద్యోగులు మాత్రం ఈ బడ్జెట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనరల్ ఎలక్షన్స్(General Elections) కు కొద్దీ నెలలే సమయం ఉండడంతో కేంద్రం తీపి కబురు అందిస్తుందానన్న ఆశ ఉద్యోగుల్లో(Employees) కనిపిస్తోంది. ఇదే సమయంలో ఓ ఆసక్తికర సర్వే బయటకు వచ్చింది. మధ్యంతర బడ్జెట్‌కు సంబంధించి నిర్వహించిన కేర్ రేటింగ్ సర్వే 120 మంది ప్రముఖుల నుంచి అభిప్రాయాన్ని కోరింది.
ఉండకపోవచ్చు:
ఆదాయపు పన్ను(Tax) మినహాయింపుపై ప్రజలకు చాలా తక్కువ ఆశలు ఉన్నాయని ఈ సర్వే చూస్తే అర్థమవుతోంది. పన్ను మినహాయింపు ఇవ్వబోరని 63 శాతం మంది అభిప్రాయపడగా, మినహాయింపు ఇవ్వొచ్చని 37 శాతం మంది అభిప్రాయపడ్డారు. బడ్జెట్ ఎదుర్కొంటున్న సవాళ్లలో మొదటి స్థానంలో ప్రపంచ భౌగోళిక రాజకీయ బెదిరింపులు ఉన్నాయి. 55 శాతం మంది ప్రజలు దీనిని పెద్ద ముప్పుగా భావిస్తున్నారు. 25 శాతం మంది ఉద్యోగాల్లో వృద్ధిని ముప్పుగా పరిగణిస్తున్నారు. సర్వేలో 8 శాతం మంది గ్రామీణ ప్రాంతాల సవాళ్లను ముప్పుగా పరిగణిస్తున్నారు. వ్యాపారవేత్తల డిమాండ్ల గురించి 57 శాతం మంది ప్రజలు మాట్లాడారు. ఉపాధిని పెంచే చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. 46 శాతం మంది ప్రభుత్వం సామర్థ్య విస్తరణ లక్ష్యంగా పెట్టుకోవాలని అభిప్రాయపడ్డారు.
వ్యాపారానికి సహాయపడే చర్యలపై ప్రభుత్వం(Government) దృష్టి పెట్టాలని 43 శాతం మంది ప్రజలు కోరుతున్నారు. 28 శాతం వ్యాపారులు ఎగుమతులకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బడ్జెట్‌పై 86 శాతం మంది సానుకూలంగా స్పందించారు. సామర్థ్య విస్తరణకు సంబంధించి, 30 శాతం మంది ప్రజలు గత ఆర్థిక సంవత్సరం కంటే ఎక్కువగా ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. గతేడాది రూ.10 లక్షల కోట్లతో పోలిస్తే ఈ ఏడాది రూ.13 లక్షల కోట్లకు పైగానే రావచ్చని వ్యాపారులు భావిస్తున్నారు.
Also Read: జాతీయ బాలికా దినోత్సవం .. జనవరి 24నే ఎందుకు?
WATCH: