Signal jump: వాహనదారులకు గుడ్ న్యూస్.. సిగ్నల్ జంప్‌కు నో ఫైన్!

బెంగళూర్ వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు గుడ్ న్యూస్ చెప్పారు. సిగ్నల్ జంప్ ఫైన్ నిబంధనల్లో కొత్త మార్పులు చేసినట్లు తెలిపారు. అంబులెన్స్‌కు దారి ఇవ్వడానికి ట్రాఫిక్‌ రూల్స్ బ్రేక్ చేస్తే జరిమానా విధించమని స్పష్టం చేశారు. ఒకవేళ ఫైన్ పడితే ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సెంటర్‌ను సంప్రదించాలన్నారు.

New Update
Signal jump: వాహనదారులకు గుడ్ న్యూస్.. సిగ్నల్ జంప్‌కు నో ఫైన్!

Bengalore: బెంగళూర్ నగరంలో అంబులెన్స్ లు మరింత వేగంగా సహాయం అందించేందుకు ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సిగ్నల్ జంప్ ఫైన్ నిబంధనల్లో కొత్త మార్పులు చేశారు. అంబులెన్స్‌కు దారి ఇవ్వడానికి ట్రాఫిక్‌ రూల్స్ బ్రేక్ చేసిన జరిమానా విధించమని ట్రాఫిక్ అధికారులు స్పష్టం చేశారు. అంతేకాదు అంబులెన్స్ దారి ఇచ్చే క్రమంలో ట్రాఫిక్ సిగ్నల్ కెమెరాల ద్వారా జరిమానాలు విధిస్తే ఇన్‌ఫాంట్రీ రోడ్‌లోని ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సెంటర్‌ను సంప్రదించాలని తెలిపారు. కర్ణాటక స్టేట్ పోలీస్ (KSP)యాప్ ద్వారా కూడా ప్రయాణికులు ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు.

నిరంతరం పర్యవేక్షించడం కోసం..
ఇక దీనిపై అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిర్వహణలో సహాయం చేయడం, హిట్ అండ్ రన్ కేసులు, మహిళలపై వేధింపులు మొదలైన వాటిపై నిరంతరం పర్యవేక్షించడం కోసం రహదారులపై మరిన్ని ఏఐ ఎనేబుల్డ్‌ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాం. శాంతిభద్రతల పరిరక్షణకు ఇవి ఉపయోగపడతాయి. సేఫ్ సిటీ ప్రాజెక్ట్ మూడోదశలో భాగంగా 150 వాచ్ టవర్లు, 8 హై-డెఫినిషన్ ఫేస్-రికగ్నిషన్ కెమెరాలను బస్టాప్‌లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాటు చేస్తామన్నారు.

అలాగే ప్రజల సమస్యలు తీర్చడంతోపాటు ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) అనుచేత్ తెలిపారు. 'ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద ఉన్న కెమెరాలు ప్రతీ 5 సెకన్లకు వాహనదారుల కదలికలను రికార్డ్‌ చేస్తాయి. అంబులెన్స్‌కు దారివ్వడానికి వాహనదారుడు సిగ్నల్ జంప్ చేసినట్లు గుర్తిస్తే వెంటనే జరిమానా రద్దు అవుతుంది. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ అంబులెన్స్‌లను గుర్తించి తమంతట తాము రెడ్ నుంచి గ్రీన్ కలర్ లోకి మారేలా జియోఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశాం. దాదాపు 80 అంబులెన్స్‌లకు జీపీఎస్‌ను అమర్చాం' అని ఆరోగ్య, సంక్షేమశాఖ స్పష్టం చేసింది.

Advertisment
తాజా కథనాలు