నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో రాబోతున్న కల్కి 2989 సినిమా కోసం తెలుగు ప్రజలతో పాటూ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరో రెండు నెలలో విడుదల అవనున్న ఈ సినిమా ఓ ఫిక్షన్ కథతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ రిలీజే ఒక రేంజ్‌లో ఉంది. కల్కి సినిమా కోసం నాగ్ అశ్విన్ కొత్త వాతావరణం సృష్టించాడు. ఈ మూవీ 800 ఏళ్ళ తర్వాత జరిగే కథగా చూపించబోతున్నారు. దేవుడితో కనెక్షన్ ఉన్న కథ. ఇప్పుడు దీన్ని ఇంగ్లీషు మూవీ డ్యూన్‌తో పోలుస్తున్నారు. డ్యూన్‌లో 20 వేల సంవత్సరాల తర్వాత భూమిపై సజీవంగా ఉన్న కొంతమంది వారి ఉనికిని కాపాడుకోవడం ఎలాంటి పోరాటం చేసారు అనేది చూపించారు. ఆ సినిమా కోసం కొత్త వాతావరణం సృష్టించారు. ఈ రెండు సినిమా కథాంశం కొంచెం ఒకేలా ఉండడంతో కల్కి మూవీ డ్యూన్‌కు కాపీ అని అందరూ అంటున్నారు.
ఈ కంపారిజన్‌పై దర్శకుడు నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు. అది కూడా తనదైన శైలిలో. కాస్త ఇసుక కనిపించగానే రెండూ ఒకటే అనేసుకోవడమేనా..అసలు రెండు సినిమాలకూ పోలికే లేదు అని చెప్పుకొచ్చారు. ఇలా ఒక సినిమాను ఇంకో దానితో పోల్చడం కొత్తేమీ కాదు. ఇంతకు ముందు కూడా చాలాసార్లు చేశారు అని నవ్వుతూ చెప్పారు.
రీసెంట్ గా మూవీ యూనిట్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో కల్కిగా ప్రభాస్, అశ్వద్ధామగా అమితాబచ్చన్, దీపికా పదుకునే పాత్రలని హైలైట్ చేశారు. ఈ పోస్టర్ బ్యాగ్రౌండ్ అంతా కూడా మైథాలజీకి కనెక్ట్ అయ్యే సింబల్ ని రిప్రజెంట్ చేశారు. ఇందులోనే కాస్త ఇసుక రేగినట్టుగా కూడా బ్యాగ్రౌండ్‌లో కనిపిస్తోంది. అదిగో అది చూసే కల్కిని డ్యూన్ సినిమాతో పోలుస్తున్నారు అందరూ.
Also Read:Karnataka: జేడీ(ఎస్) పార్టీ నుంచి ప్రజ్వల్ రేవణ్ణ సస్పెండ్