TSPSC: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. పరీక్షలు అప్పుడేనా! టీఎస్పీఎస్సీ పరీక్షలు ఎప్పుడన్న విషయమై సందిగ్ధం కొనసాగుతోంది. టీఎస్పీఎస్సీ, ఇతర ఉద్యోగ నియామక పరీక్షలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, చైర్మన్ సహా బోర్డు సభ్యుల రాజీనామాలు; అనంతర పరిణామాలు అభ్యర్థులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. By Naren Kumar 13 Dec 2023 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి TSPSC Exams: టీఎస్పీఎస్సీ పరీక్షలు ఎప్పుడన్న విషయమై సందిగ్ధం కొనసాగుతోంది. టీఎస్పీఎస్సీ, ఇతర ఉద్యోగ నియామక పరీక్షలపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమీక్ష, చైర్మన్ సహా బోర్డు సభ్యుల రాజీనామాలు; అనంతర పరిణామాలు అభ్యర్థులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి.. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లు అలాగే కొనసాగుతాయా, లేదంటే పోస్టులను కలిపి కొత్త నోటిఫికేషన్‌గా వెలువరిస్తారా.. లేదా పాత నోటిఫికేషన్లు రద్దు చేస్తారా.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ (Congress Job Calender) అమలు దిశగా ప్రభుత్వ కార్యాచరణ ఎలా ఉండబోతోంది?.. సీఎం ఆదేశించినట్టు యూపీఎస్సీ సహా వివిధ బోర్డుల పనితీరుపై అధ్యయనం, నివేదిక ఎప్పుడు వెలువడుతాయి?.. ఇన్ని అస్పష్టతలు కలిసి పరీక్షార్థుల ముందు ఓ పెద్ద ప్రశ్నార్థకాన్ని నిలిపాయి. ఇది కూడా చదవండి: పరీక్షల సంగతేంటి!.. అభ్యర్థుల్లో సందిగ్ధం రేవంత్ రెడ్డి సమీక్ష.. వివిధ బోర్డుల పనితీరుపై అధ్యయనం చేయాలని నిర్ణయం టీఎస్పీఎస్సీ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాల లీకేజీ, కేసులకు సంబంధించిన వివరాలపై సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. సీఎస్ శాంతికుమారితో (CS Shanti Kumari) పాటు పోలీసు ఉన్నతాధికారులు, టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ పాల్గొన్న ఈ సమీక్షలో కమిషన్ వెలువరించిన నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణ, చేపట్టిన నియామకాలు, తదితర అంశాలపై వివరాలు తీసుకున్నారు. యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీసు కమిషన్ల పనితీరుపై సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధ్యయనం కోసం కమిటీ, ఆ ప్రక్రియ పూర్తై నివేదిక సిద్ధమయ్యే సరికి ఎంత సమయం పడుతుందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అప్పటి వరకూ పాత నోటిఫికేషన్ల స్థితిగతులపైనా క్లారిటీ రాలేదు. ఇది కూడా చదవండి: TSPSC: టీఎస్పీఎస్సీలో ఏం జరుగుతోంది?.. సభ్యుల రాజీనామా టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన.. కొత్త బోర్డు ఎప్పుడో! మరోవైపు టీఎస్‌పీఎస్సీని (TSPSC) ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. చైర్మన్ తో పాటు సభ్యులంతా ఇప్పటికే రాజీనామాలను సమర్పించిన విషయం తెలిసిందే. అయితే, గవర్నర్ వద్ద ఇంకా ఆ రాజీనామాలు పెండింగ్ లోనే ఉన్నాయి. విచారణ ప్రక్రియపై స్పష్టత వచ్చిన తర్వాతే రాజీనామాలను ఆమోదించాలని గవర్నర్ ఓ నిర్ణయానికొచ్చినట్లు సమచారం. ఇదిలా ఉండగా, కొత్తగా బోర్డు ఏర్పాటు ప్రక్రియ ఎప్పుడు కొలిక్కి వస్తుందో వేచిచూడాలి. బోర్డు కొత్త చైర్మన్, సభ్యుల నియామకంపైనా ఉత్కంఠ నెలకొంది. రాజకీయాలకు అతీతంగా విద్యావేత్తలు, ప్రొఫెసర్లను ఆ పదవుల్లో నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదంతా పూర్తయ్యే వరకూ పరీక్షల స్థితిగతులేమిటన్నది తెలియాల్సి ఉంది. ఇవేకాకుండా అవేకాకుండా మార్చి, ఏప్రిల్ నెలల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు; అనంతరం సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీఎస్పీఎస్సీ ఇప్పటికే ప్రకటించిన, రద్దు చేసిన, వాయిదా వేసిన, తేదీలు ప్రకటించని పరీక్షల వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందన్నదీ ఆసక్తికరంగా మారింది. #cm-revanth-reddy #tspsc-exams #tspsc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి