Break : గత కొంతకాలం వరకు కూడా ఎండాకాలం(Summer) వచ్చిందంటే పెళ్లిళ్లు(Marriages), ఫంక్షన్లు(Functions) ఎక్కువగా జరిగేవి. కానీ ఈసారి మాత్రం పెళ్లిళ్లతో పాటు ఇతర శుభ కార్యక్రమాలకు చాలా గ్యాప్ వచ్చింది. రానున్న మూడు నెలల పాటు ఎలాంటి శుభ కార్యాలకు సుముహుర్తాలు(Muhurtas) లేకపోవడమే దీనికి కారణం. ఏప్రిల్ 29 నుంచి మూడు నెలల పాటు వైశాఖ, జ్యేష్ట, ఆషాడ మాసాల్లో ముహుర్తాలు లేవని పండితులు వెల్లడించారు.
దీంతో పెళ్లిళ్లతో పాటు నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్టాపనలు, శంకుస్థాపనల వంటి కార్యాలకు విరామం వచ్చింది. కాగా, సూర్య కాంతి గురు గ్రహంపై పడినప్పుడు గురు మౌఢ్యమి, శుక్ర గ్రహంపై పడితే శుక్ర మౌఢ్యమి వస్తుందని పండితులు చెబుతున్నారు. ఫలితంగా ఆయా గ్రహాల గమనంలో మార్పులతో శుభ ముహూర్తాలు పెట్టడం కుదరని వారు పేర్కొంటున్నారు.
కాగా, వేద పండితులు తెలిపిన ప్రకారం.. ఈనెల 28వ తేదీ చైత్ర బహుళ చవితి ఆదివారం నాటి నుంచి జూలై 8వ తేదీ ఆషాఢ శుద్ధ తదియ సోమవారం వరకు శుక్ర పౌఢ్యమి ఉంది. అలాగే గురు పౌఢ్యమి మే 7వ తేదీ చైత్ర బహుళ చతుర్దశి మంగళవారం నుంచి జూన్ 7వ తేదీ వరకు జ్యేష్ఠ శుక్ల పాడ్యమి గురువారం వరకు కొనసాగనుందని పేర్కొన్నారు.అలాగే, గురు, శుక్ర మూఢాల్లో కొత్త శుభ కార్యక్రమాలు చేయడం మంచిది కాదని పండితులు తెలియజేస్తున్నారు.
ఇక, జులై 6 నుంచి ఆగస్టు 4 వరకు ఆషాఢ మాసం ఉండటంతో ఎలాగూ పెళ్లిళ్లు సహా ఇతర శుభకార్యాలు నిర్వహించడం సాధ్యం కాదని వెల్లడించారు.
Also read: టైటానిక్ వాచ్ ఎన్ని వందల కోట్ల ధర పలికిందో తెలుసా!