ప్రాణం తీసిన ఆస్తి వివాదం
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం గ్రామంలో అనిల్ అతని అన్నకు మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో పంచాయతీలో తనకు న్యాయం జరగలేదని అనిల్ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఆదివారం ( ఆగస్టు7 )న మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు డబ్బాతో సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పురుగుల మందు తాగి అనిల్ (39) ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు మిత్రులు అనిల్‌ను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరిస్థితి సీరియస్‌గా ఉందని డాక్టర్లు తెలిపారు. ఆత్మహత్యకు ముందు తన 10వ తరగతి బ్యాచ్ మిత్రులకు తన కుటుంబానికి న్యాయం చేయాలని, మీ అందరిని వీడి ఆత్మహత్యకు పాల్పడుతున్నందుకు బాధగా ఉందని, ఇక సెలవు అంటూ చేసిన సెల్ఫీ వీడియో అందర్నీ కన్నీరు పెట్టిస్తోంది.
నా కుటుంబానికి న్యాయం చేయండి ప్లీజ్
ఈ మధ్యకాలంలో సెల్ఫీ సూసైడ్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. తమ కుటుంబాలకు న్యాయం జరగకపోవడంతో మనస్థాపానికి గురై ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అనిల్ కూడా తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనిల్ మృతితో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. అన్నపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనీల్ మృతిని పోస్టుమార్టం చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు మృదేహాన్ని అప్పగించనున్నారు.
బంధాన్ని తెప్పిన ఆస్తి
ఆస్తుల కోసం తోడబుట్టిన వారే ఇలా మోసం చేస్తున్న ఘటనలు దేశంలో చాలా జరుగుతూనే ఉన్నాయి. చనిపోయే ముందు వారు తీసుకున్న సెల్ఫీ వీడియో..బలవన్మరణానికి పాల్పతున్న ఆ ఘటనల్ని చూస్తే కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. కలిసి జీవించాల్సిన అన్నలు, కష్టసుఖాలలో తోడుండి ఆదుకోవాల్సింది పోయి.. ఇలా ఆస్తి కోసం తమ్ముడి ని బలి తీసుకున్న అన్న చూస్తే ఆ బంధానికి విలువ లేకుండా పోతోంది. తనకు రావాల్సిన ఆస్తిని.. సొంత తమ్ముడికి ఇవ్వకుండా మోసం చేసిన అన్నకు ఆస్తి పోకుండా తనకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.