Bihar CM Nitish Kumar: బీహార్ లో రాజకీయ సంక్షోభం కొలిక్కి వచ్చింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా? లేదా ఇండియా కూటమిలో కొనసాగుతారా అనే చర్చకు తెర పడింది. ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమికి గుడ్ బై చెప్పారు నితీష్ కుమార్. బీజేపీతో తిరిగి స్నేహం చేసేందుకు సై అన్నారు. రేపు ఉదయం 10 గంటలకు జేడీఎల్పీ సమావేశం జరగనుంది. ఆ సమావేశం పూర్తి అయిన తరువాత గవర్నర్ ను కలిసి తన సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేయనున్నట్లు సమాచారం.
బీహార్ లో బీజేపీ తో పొత్తు ఏర్పడిన తరువాత 9వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు నితీష్. రేపు సాయంత్రం నాలుగు గంటలకు మళ్లీ బీహార్ ముఖ్య మంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పొత్తులో భాగంగా బీజేపీకి రెండు డిప్యూటీ సీఎం పదవులతో పాటు స్పీకర్ పదవిని కట్టబెట్టనున్నారు నితీష్ కుమార్. బీజేపీ నేతలు రేణు దేవి, సుశీల్ మోడీకి డిప్యూటీ సీఎంలు అవకాశం దక్కింది. ఈ క్రమంలో రేపు బీహార్ రాజధాని పాట్నాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వెళ్లనున్నారు.
NEWS IS BEING UPDATED