Nithiin: 'రాబిన్‌హుడ్' వచ్చేస్తోంది.. నితిన్ నయా లుక్ చూస్తే గూస్ బంప్సే! నితిన్, వెంకీ కుడుముల కాంబోలో వస్తున్న సెకండ్ మూవీ 'రాబిన్‌హుడ్' రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. 2024 డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుపుతూ నితిన్ నయా లుక్ విడుదల చేశారు. మాస్ లుక్ కు ఫిదా అయ్యామంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. By srinivas 17 Apr 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Robinhood: సీతారాముల కళ్యాణం శుభ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీనుంచి వరుస అప్ డేట్స్ వెలువడుతున్నాయి. ఇప్పటికే 'జై హనుమాన్', 'హరిహర వీరమల్లు' నుంచి సాలిడ్ అప్ డేట్ రిలీజ్ కాగా.. తాజాగా యంగ్ హీరో నితిన్ అప్ కమింగ్ మూవీ 'రాబిన్‌హుడ్' రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. అంతేకాదు దీంతోపాటు నితిన్ లేటెస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయగా అభిమానులను తెగ అట్రాక్ట్ చేస్తోంది. Make way for the conman you'd love to meet ❤🔥#Robinhood in cinemas from December 20th, 2024 💥💥@actor_nithiin @VenkyKudumula @gvprakash @SonyMusicSouth pic.twitter.com/8uARUhDGlX — Mythri Movie Makers (@MythriOfficial) April 17, 2024 శ్రీరామ నవమి సందర్భంగా.. ఈ మేరకు వెంకీ కుడుముల, నితిన్ కాంబోలో ఇప్పటికే 'భీష్మ' వచ్చిన విషయం తెలసిందే. కాగా వీరిద్దరి కలయికలో వస్తున్న సెకండ్ మూవీ రాబిన్‌హుడ్. భీష్మ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదలవగా ప్రేక్షకుల నుమచి మంచి ఆదరణ లభించింది. అయితే శ్రీరామ నవమి సందర్భంగా మూవీ నుంచి విడదల తేదీ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మూవీని వరల్డ్ వైడ్‌గా 2024 డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. నితిన్ బైక్ పై మాస్ లుక్ లో కనిపిస్తున్న పోస్టర్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇది కూడా చదవండి: Malaika Arora: కొడుకుతో సెక్స్ డిస్కషన్.. వర్జినిటీపై మలైకాకు షాక్ ఇచ్చిన అర్హాన్.. వీడియో వైరల్! ఇక ఈ సినిమాలో రాశీఖన్న హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తుండగా.. ఈ జంట ఇప్పటికే ‘శ్రీనివాస కల్యాణం’ చిత్రంతో అలరించింది. అలాగు బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ ఇందులో కీలకపాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. #venky-kudumula #nitin #robinhood మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి