Nitya Menon: పెళ్లి కూతురైన నిత్యా మీనన్‌..షాక్‌ లో అభిమానులు!

మలయాళ ముద్దుగుమ్మ నిత్యా మీనన్ పెళ్లి కూతురిగా ముస్తాబైన ఫొటోను షేర్ చేసి అందరిని షాక్‌ కి గురి చేసింది. ఆ ఫొటో ను చూసిన అభిమానులు నిత్య మీనన్ కి పెళ్లి అయిపోయిందా అంటూ ఆశ్చర్యానికి గురౌతున్నారు. అయితే ఆ చిత్రం తన తరువాత చిత్రానిది అంటూ రాసుకోచ్చింది.

New Update
Nitya Menon: పెళ్లి కూతురైన నిత్యా మీనన్‌..షాక్‌ లో అభిమానులు!

అలా మొదలైంది చిత్రంతో నాని సరసన హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ నిత్యా మీనన్‌(Nitya menon) . ఆ తరువాత ఎన్టీఆర్‌(NTR) , అల్లు అర్జున్‌, నితిన్‌ , పవన్‌ కల్యాన్‌, శర్వానంద్‌, సూర్య, విజయ్‌ దేవరకొండ వంటి అగ్ర హీరోలందరి సరసన నటించి తన నటనతో అందరినీ మెప్పించింది. అయితే చాలా కాలంగా నిత్య సినిమాలకు కొంచెం గ్యాప్‌ ఇచ్చింది.

ఇప్పుడు మరోసారి తాజాగా నిత్య వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. తెలుగు, మలయాళం లో వెబ్‌ సిరీస్‌ లు చేస్తూ అభిమానుల్లో మరింత క్రేజ్‌ ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. అయితే వరుస వెబ్ సిరీస్‌ లు చేస్తూ బిజీగా ఉన్న నిత్యా మీనన్ తాజాగా ఓ ఫొటో షేర్‌ చేసి అందరినీ షాక్ కు గురి చేసింది.

నిత్య పెళ్లి కూతురిగా ముస్తాబై ఉన్న ఫొటోను షేర్‌ చేసింది. అందులో ఆమె పెళ్లికూతురిగా (Bride) మంచం మీద పడుకుని ఉంది. దానిని చూసిన వారంతా కూడా నిత్య పెళ్లి ఎప్పుడు చేసుకుంది. ఎవర్ని చేసుకుంది అనే ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. ఆ ఫొటో కింద
తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్ సమాప్తి సినిమాకి సంబంధించినది అంటూ రాసుకొచ్చింది.

దీంతో ఆమె అభిమానులు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. సమాప్తి సినిమాలోని మృణ్మోయి పాత్రను నిత్య పోషిస్తుంది. ఇది ఓ ప్రేమ కథ. ఇందులో ప్రధాన పాత్ర అయిన మృణ్మోయి వికృతమైన నిర్లక్ష్య యువతి నుంచి ప్రేమించే భార్యగా చేసే ప్రయాణాన్ని ఈ కథ చెబుతుంది.
ప్రస్తుతం నిత్యామీనన్ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారడంతో చూసిన వారంతా నిత్య పెళ్లి కూతురిగా చాలా బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also read:  రెండు తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. మూడు డిగ్రీలు అధికం!

Advertisment
Advertisment
తాజా కథనాలు